T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ కు రెండు వారాలే.. భారత్ ఆడే మ్యాచ్ ల వివరాలివే..

ఈ నేపథ్యంలో టి20 వరల్డ్ కప్ ఎలాగైనా సాధించాలని భావిస్తుంది. గత టి20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయింది. ఇన్ని వైఫల్యాల నేపథ్యంలో ఈసారి కప్ సాధించాలని రోహిత్ సేన భావిస్తోంది.

Written By: NARESH, Updated On : May 19, 2024 2:03 pm

T20 World Cup 2024 Team India Match Schedule

Follow us on

T20 World Cup 2024 : ఐపీఎల్ మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ క్రికెట్ ఆనందం ముగిసిన కొద్ది రోజులకే టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. జూన్ రెండు నుంచి వెస్టిండీస్, అమెరికా దేశాల వేదికగా టి20 వరల్డ్ కప్ మొదలవుతుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. జూన్ 5 న న్యూయార్క్ వేదికగా భారత జట్టు తొలి మ్యాచ్ ఆడుతుంది..

ఇదే షెడ్యూల్

జూన్ 5న బుధవారం ఐర్లాండ్ జట్టుతో రోహిత్ సేన తలపడుతుంది.. న్యూయార్క్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. నసావు స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తుంది.

జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో భారత్ ఆడుతుంది. ఈ మ్యాచ్ కూడా న్యూయార్క్ లోని నసావు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది.

జూన్ 12 బుధవారం నాడు భారత జట్టు అమెరికాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ కూడా న్యూయార్క్ లోని నసావు స్టేడియంలో జరుగుతుంది.

జూన్ 15 శనివారం భారత్ కెనడా జట్టుతో తలపడుతుంది. అమెరికాలోని లాండర్ హిల్ ప్రాంతంలోని సెంట్రల్ బ్రో వార్డ్ పార్క్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది..

నాలుగు లీగ్ మ్యాచ్ ల తర్వాత పాయింట్ల పట్టికలో టాప్ -2 దశలో నిలిచిన జట్లు.. సూపర్ -8 దశకు వెళ్తాయి. ఆ తర్వాత ఎనిమిది జట్ల మధ్య మ్యాచ్ లు జరుగుతాయి. ఇందులో టాప్ – 4 లో నిలిచిన జట్లు సెమీఫైనల్ చేరుకుంటాయి.. భారత కాలమానం ప్రకారం టీ – 20 ప్రపంచ కప్ మ్యాచ్ లన్నీ రాత్రి 8 గంటల తర్వాత మొదలవుతాయి.

క్రికెట్ కు క్రేజ్ మరింత పెంచేందుకు ఐసిసి ఈ టోర్నీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. చరిత్రలో తొలిసారిగా 20 జట్లతో టి20 వరల్డ్ కప్ ను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో అమెరికాలోని పలు ప్రాంతాలలో యుద్ధ ప్రాతిపదికన మైదానాలు నిర్మించింది. ఈ మైదానాలలో కృత్రిమంగా గడ్డిని కూడా పెంచింది. అధునాతన స్థాయిలో సౌకర్యాలు కల్పించింది. ఏకంగా ఫ్యాన్స్ పార్క్ కు కూడా అనుమతులు ఇచ్చింది. గత ఏడాది స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్ లో టీమిండియా టేబుల్ టాపర్ గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో టి20 వరల్డ్ కప్ ఎలాగైనా సాధించాలని భావిస్తుంది. గత టి20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయింది. ఇన్ని వైఫల్యాల నేపథ్యంలో ఈసారి కప్ సాధించాలని రోహిత్ సేన భావిస్తోంది.