KTR: తెలంగాణలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పదేళ్ల బీఆర్‌ఎస్ అవినీతిని ఎండగట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్‌ను కుంభకోణాల్లో ఇరికించాలని బీఆర్‌ఎస్ కూడా ప్రయత్నిస్తోంది. ఇటీవల బెంగళూరులో జరిగిన స్కాంను తెలంగాణ నేతలకు అంటడగుతోంది. తాజాగా కేటీఆర్ మరో అవినీతిని బయటపెట్టి.. సీఎం రేవంత్‌రెడ్డిని అడ్డంగా బుక్ చేశారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ నేతలు మాట్లాడారు. మంత్రలతోపాటు, ప్రధాని నరేంద్రమోదీ కూడా రాష్ట్ర ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ.. నాటి ఆరోపణలపై చర్యలు తీసుకోకపోవడాన్ని కేటీఆర్ తప్పు పట్టారు.
ఎక్స్ వేదికగా ట్వీట్..
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కేటీఆర్.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎక్స్ వేదికగానే ఎండడుతున్నారు. హామీల అమలుపై ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఎక్స్ వేదికగానే కేటీఆర్ లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడిన ఓ వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారు. అందులో మోదీ గతంలో ఆర్‌ఆర్ ట్యాక్స్ గురించి మాట్లాడారు. ‘మీ కేబినెట్ మంత్రులు కాంగ్రెస్ అవినీతిపై మాట్లాడటం లేదు.. ప్రధాని మోదీజీ, మీరు తెలంగాణలోని ఆర్‌ఆర్ ట్యాక్స్ గురించి మాట్లాడి నాలుగు నెలలు అయింది… అయినప్పటికీ ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పండి’ అని ప్రశ్నించారు.
నాలుగు నెలల క్రితం..
లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణకు వచ్చిన ప్రధాని మోదీ.. రాష్ట్రంలో ప్రభుత్వం ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుందని ఆరోపించారు. ఇక్కడ వసూలు చేసిన ట్యాక్స్‌ను ఢిల్లీకి కప్పం కడుతోందని పేర్కొన్నారు. గతంలో బీఆర్‌ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా వాడుకుందని కూడా విమర్శించారు. ఇప్పుడు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇదే విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రశ్నించి రేవంత్ సర్కార్‌ను ఇరికించే ప్రయత్నం చేశారు. నాలుగు నెలల క్రితం మాట్లాడిన కేంద్ర మంత్రులు కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యారని పేర్కొన్నారు.
PM Modi Ji,
It’s been more than 4 months since you talked about “RR Tax” in Telangana
Any specific reason why no action has been initiated by your Govt?
While you say Congress in Telangana has been indulging in massive corruption, why do neither of your colleagues in Cabinet… https://t.co/BqwWIIKS2h
— KTR (@KTRBRS) September 16, 2024
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Ktr booked revanth reddy horizontally
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com