KTR Birthday Celebrations: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. తెంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తనయుడు కల్వకుంట్ల తారకరామారావు. జూలై 24న తన 49వ పుట్టిన రోజు వేడుక జరుపుకున్నారు. ప్రతీ పుట్టిన రోజులు కుటంబ సభ్యులతో జరుపుకుంటారు. తండ్రి, తల్లి ఆశీర్వాదం తీసుకుంటారు. ఈసారి కూడా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే పుట్టిన రోజు వేడుకను మాత్రం ఈసారి భిన్నంగా జరుపుకున్నారు. తమ నాయకుడి పుట్టిన రోజు అంటేనే కార్యకర్తలకు పెద్ద పండుగ. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. కేటీఆర్ మాత్రం ఓ కార్యకర్త ఇంట్లో తన బర్త్‌డే చేసుకున్నారు. ఆ కార్యకర్త కూడా ఆయనకు ఓ స్పెషల్. సోషల్ మీడియా కార్యకర్త నల్లబాలు అలియాస్ శశిధర్ గౌడ్ ఇంట్లో కేటీఆర్ బర్త్‌డే చేసుకున్నారు.
ట్వీట్ రీట్వీట్ చేశాడని..
శశిధర్ ఓ ట్వీట్‌ను రీట్వీట్ చేశాడని పోలీసులు అరెస్టు చేశారు. భోజనం చేస్తుండగా శశిధర్ ఇంటికి వచ్చిన ఫోలీసులు ఆయన కంచం లాగి పడేసి బలవంతంగా తీసుకెళ్లారు. ఈ కేసులో శశిధర్ 17 రోజుల జైలు శిక్ష అనుభవించాడు. తన కోసం, పార్టీ కోసం జైలుకు వెళ్లిన కార్యకర్త ఇంట్లో కేటీఆర్ సాదాసీదాగా బర్త్‌డే చేసుకోవడంతోపాటు సామాన్య భోజనం చేయడం కార్యకర్తల్లో జోష్ నింపింది.
కార్యకర్తలకు భరోసా మెస్సేజ్..
ఫార్ములా–ఈ రేస్ కేసులో అవినీతి ఆరోపణలు, ఏసీబీ విచారణ, ఇంటి నిర్బంధం వంటి సవాళ్ల మధ్య కేటీఆర్ తన నిబద్ధతను కొనసాగించారు. శశిధర్ గౌడ్‌ను కేవలం ఒక ట్వీట్ రీట్వీట్ చేసినందుకు అరెస్టు చేసినప్పటికీ, కేటీఆర్ ఆ కుటుంబాన్ని ఆదరించి, వారితో కలిసి పుట్టినరోజు జరుపుకున్నారు, ఇది ఆయన నాయకత్వంలోని మానవీయ కోణాన్ని తెలియజేసింది. ఈ పుట్టినరోజు వేడుక కేవలం ఒక ఆచారం కాదు, బీఆర్‌ఎస్ కార్యకర్తలకు కేటీఆర్ అందించిన భరోసా. ‘‘అన్నా అంటే నేనున్నా’’ అనే సందేశంతో, రాజకీయ ఒత్తిడులను ఎదుర్కొంటూ కార్యకర్తలతో ఆయన బంధాన్ని బలోపేతం చేశారు.
Also Read: వినయ విధేయ రేవంత్
క్యాడర్‌లో జోష్..
తమ లీడర్ బర్త్‌డేను ఊరూరా క్యాడర్ నిర్వహించింది. ఇక ఈ పుట్టిన రోజును అన్న ఒక కార్యకర్త ఇంట్లో జరుపుకన్నాడని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న కార్యకర్తలు మరింత మురిసిపోయారు. కార్యకర్తలపై కేటీఆర్‌కు ఉన్న అభిమానానికి కేడర్ ఉబ్బి తబ్బిబవుతోంది. ఈ సంఘటన బీఆర్‌ఎస్ కార్యకర్తలకు ఒక పెద్ద ఊరట.