https://oktelugu.com/

Congress Six Guarantees : కాంగ్రెస్ ఆరు గ్యారంటీల స్టేటస్ మీ చేతిలోనే.. ఎలా తెలుసుకోవాలంటే?

అనివార్య కారణాల వల్ల దరఖాస్తు చేసుకోలేని ప్రజలకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అవకాశం కల్పించింది. ఆ కాల పరిమితిలో ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.

Written By:
  • NARESH
  • , Updated On : January 17, 2024 / 09:40 PM IST
    Follow us on

    Congress Six Guarantees, : ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీ ల పేరుతో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రజా పాలన పేరుతో ఇప్పటికే ప్రజల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. ప్రత్యేకంగా అధికారులను నియమించి.. కౌంటర్లు ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరించింది. దరఖాస్తులను స్వీకరించడం మాత్రమే కాకుండా వాటిని ఆన్లైన్ చేసే పనిని కూడా వేగంగా ప్రారంభించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ ప్రక్రియ పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే గతంలో ఏదైనా ప్రభుత్వ సంక్షేమ పథకానికి దరఖాస్తు చేసుకుంటే.. దానికి సంబంధించిన స్టేటస్ తెలుసుకునే అవకాశం ప్రజలకు ఉండేది కాదు. కానీ గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ఉండేందుకు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా వినూత్నమైన విధానాలకు శ్రీకారం చుట్టింది.

    ఆరు గ్యారెంటీ ల పేరుతో ప్రజల నుంచి మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలకు దరఖాస్తులు స్వీకరించిన అధికారులు.. వాటిని ఆన్లైన్ చేయడం పూర్తి చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో అత్యంత తెలివిగా వ్యవహరిస్తోంది. దరఖాస్తులకు సంబంధించి స్టేటస్ చెక్ కోసం నేరుగా ప్రజలకే అవకాశం ఇచ్చింది.. ప్రజాపాలన అభయ హస్తం వెబ్సైట్లో అప్లికేషన్స్ స్టేటస్ విండో ఓపెన్ చేసింది. ప్రజలు గ్యారంటీలకు దరఖాస్తు చేసుకున్న సమయంలో తమకు ఇచ్చిన రిసిప్ట్ నెంబర్ ఎంటర్ చేసి తమ ప్రజాపాలన అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఆ లింకు ద్వారా దరఖాస్తు స్థితి తెలుసుకోవచ్చు. దరఖాస్తు నెంబర్ ఎంటర్ చేసి దాని కిందనే ఉన్న క్యాప్చా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత వ్యూ స్టేటస్ పై క్లిక్ చేస్తే దరఖాస్తు ఇది తెలుస్తుంది. బుధవారంతో ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ ముగిసింది. ఇక ఈ దరఖాస్తులను డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రభుత్వం అధికారుల ఆధ్వర్యంలో ప్రజల నుంచి స్వీకరించింది. ఎనిమిది రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి ఒకటి పాయింట్ ఒకటి ఒకటి ఎనిమిది రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి 1.11 కోట్ల దరఖాస్తులు వచ్చాయి. అభయ హస్తం గ్యారెంటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులు, ఇతర పథకాలకు సంబంధించి 19,92,747 దరఖాస్తులు వచ్చాయి.

    ఇక ఈ ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించి ప్రభుత్వం ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీకి చైర్మన్ గా ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ప్రభుత్వం నియమించింది. సభ్యులుగా మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ను నియమించింది. వీరు ఆరు గ్యారెంటీల అమలును నోడల్ అధికారుల సహాయంతో పర్యవేక్షిస్తుంటారు. అర్హులైన అందరికీ ఈ పథకాలు వర్తించేలాగా చర్యలు తీసుకుంటారు. ప్రతిపక్షాలు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో 6 గ్యారంటీల అమలును పకడ్బందీగా చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. దరఖాస్తుల ప్రక్రియను ఎనిమిది రోజుల్లో ముగించిన ప్రభుత్వం.. అనివార్య కారణాల వల్ల దరఖాస్తు చేసుకోలేని ప్రజలకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అవకాశం కల్పించింది. ఆ కాల పరిమితిలో ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.