https://oktelugu.com/

IND vs AUS: మనసు మార్చుకున్న రోహిత్.. టీమిండియాకు రోమాలు నిక్కబొడిచే శుభవార్త ఇది..

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల రెండోసారి తండ్రి అయ్యాడు. అతని భార్య రెండవ సంతానంలో పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో భార్య పక్కనే ఉండాలని నిర్ణయించుకున్న రోహిత్.. పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్ట్ కు దూరమయ్యాడు. దీంతో భారత జట్టుకు బుమ్రా నాయకత్వం వహించనున్నాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 21, 2024 / 09:17 PM IST

    Pat cummins

    Follow us on

    IND vs AUS: పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి 27 వరకు తొలి టెస్ట్ జరుగుతుంది.. ఈ టెస్ట్ కు బుమ్రా నాయకత్వం వహిస్తున్నాడు. 2022లో అతడు జట్టుకు తొలిసారిగా ఒక టెస్టులో నాయకత్వం వహించాడు.. ఆ టెస్టులో భారత్ ఇంగ్లాండ్ జట్టుతో తలపడింది. అయితే ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మళ్లీ ఇన్నాళ్లకు బుమ్రా భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.. బుమ్రా జట్టుకు నాయకత్వం వహిస్తున్నప్పటికీ.. సగటు భారత అభిమాని మనసులో ఎక్కడో వెలితి ఉంది. అయితే ఆ వెలితిని రోహిత్ శర్మ భర్తీ చేస్తున్నాడు. అంతేకాదు రోహిత్ ఆస్ట్రేలియాకు వెళ్ళడానికి రెడీ అయ్యాడు. అయితే డిసెంబర్ 6న అడిలైడ్ వేదికగా జరిగే డే అండ్ టెస్ట్ కు రోహిత్ కెప్టెన్సీ వహిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు రోహిత్ తన మనసు మార్చుకున్నారని సమాచారం. తొలి టెస్ట్ జరిగే సందర్భంలోనే రోహిత్ టీం ను మీట్ అవుతాడని తెలుస్తోంది. నవంబర్ 24 న రోహిత్ కంగారు గడ్డపై అడుగుపెడతాడని పలు నివేదికలు చెబుతున్నాయి. తొలి టెస్ట్ మూడో రోజు ఆట ప్రారంభమయ్యే సమయానికి రోహిత్ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో ఉంటాడని తెలుస్తోంది..”నవంబర్ 23న రోహిత్ శర్మ ముంబై నగరం నుంచి ప్రత్యేకమైన విమానంలో బయలుదేరుతాడు. 24న పెర్త్ చేరుకుంటాడు. జట్టుతో కలుస్తాడు. తన సలహాలు, సూచనలు ఇస్తాడు. అంతేకాక ఆడి లైడ్ లో జరిగే డే అండ్ నైట్ టెస్ట్ ప్రాక్టీస్ కోసం శిక్షణ సిబ్బందితో సంప్రదింపులు జరుపుతాడు.. కాన్ బెర్రా లో ప్రాక్టీస్ గేమ్ కు రోహిత్ అందుబాటులోకి వస్తాడని” బిసిసిఐ వర్గాలు చెబుతున్నాయి.

    శుభారంభం చేయాలని

    మరోవైపు పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్ట్ లో గెలిచి శుభారంభం చేయాలని భారత జట్టు భావిస్తోంది.. న్యూజిలాండ్ జట్టుతో స్వదేశంలో జరిగిన సిరీస్లో ఓటమి పాలైన నేపథ్యంలో.. టీమిండియాకు పెర్త్ లో గెలవడం అత్యంత అవసరం. అందువల్లే ఆ మైదానంలో విజయం సాధించడానికి సర్వశక్తులు ఒడ్డాలని భారత జట్టు భావిస్తోంది. అందువల్లే ఇన్ని రోజులపాటు ముమ్మరంగా సాధన చేసింది. ఆటగాళ్ల సాధన పట్ల కెప్టెన్ బుమ్రా, గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలను వారు చూశారు. అనంతరం ఆటగాళ్లకు సలహాలు సూచనలు ఇచ్చారు.. పెర్త్ మైదానం బౌన్సీగా ఉంటుంది కాబట్టి.. ఒకవేళ టాస్ గెలిస్తే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయాన్ని బుమ్రాతో గౌతమ్ గంభీర్ పదేపదే చర్చించాడు.