Khammam: వ్యక్తుల జీవితానికి సంబంధించిన పునాది పాఠశాలల్లోనే పడుతుంది. ప్రైమరీ స్కూల్ నుంచి ఆ వ్యక్తుల విద్యా విధానం ద్వారానే అభివృద్ధి చెందుతారు. కొన్ని ప్రాంతాల్లో సరైన సౌకర్యాలు లేకున్నా..విద్యాబద్ధులు నేర్పే మంచి గురువులు ఉండాలని కోరుకుంటారు. మంచి గురువు ద్వారా ఒక వ్యక్తి ప్రపంచాన్నే జయించగలడు అని చరిత్ర తెలుపుతోంది. అయితే ప్రస్తుత కాలంలో కొందరు టీచర్లు చేస్తున్న పనులతో తల్లిదండ్రులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పుతూ వారికి మంచి నడవడికలో పెట్టాల్సిన వారు.. వారిపై వికృత చేష్టలు చేస్తూ అవమానాల పాలు చేస్తున్నారు. తాజాగా తెలంగాణలోని ఓ పాఠశాలలో జరిగిన సంఘటనపై తీవ్రంగా చర్చ సాగుతోంది. ఓ టీచర్ తమ స్టూడెంట్ పై చేసిన కొన్ని చేష్టల వల్ల ఆమె ఏకంగా సస్పెండ్ కే గురయ్యారు. ఈ పాఠశాలలోని విషయం బయకు వచ్చి వివాదం కావడంతో తల్లిదండ్రులు పెద్ద ఎత్తున్న ఆందోళన చేశారు. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులకు తెలియజేయాలని, కానీ ఇలా వారి కోపాన్ని పిల్లలపై చూపించి పైశాచిక ఆనందం పొందడమేంటి? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయతే ఈ సంఘటన బయకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ బయటకు రాని విషయాలెన్నో ఉన్నాయని కొందరు ఆరోపిస్తున్నారు. పిల్లల విషయంలో టీచర్లు ఇలాంటి ప్రవర్తన మానుకోవాలని అంటున్నారు. అయితే ఈ టీచర్ చేసిన నిర్వాకమేంటి? ఆమె ఇచ్చిన వివరణ ఏంటి? ఈ సంఘటన ఎక్కడ జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే.
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ జిల్లాలోని కల్లూరు మండలం పెరువంచ గ్రామంలోని ఓ పాఠశాలలో శనివారం ఓ లేడీ టీచర్ దాదాపు 15 మంది విద్యార్థులకు జుట్టు కత్తిరించింది. తానే బార్బర్ గా మారి ఇష్టం వచ్చినట్లుగా వికృతంగా కట్ చేసింది. అయితే తీవ్ర అవమానంగా భావించిన పిల్లలు తల్లదండ్రులకు చెప్పడంతో వెంటనే వారు పాఠశాలకు వచ్చి ఆందోళన చేశారు. విద్యార్థులకు అడ్డదిడ్డంగా కట్ చేసిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై పాఠశా ప్రధానోపాధ్యాయుడు స్పందించారు. అయితే ఈ సంఘటన జరిగినప్పుడు తాను 7వ తరగతిలో పాఠాలు చెబుతున్నానని, అయితే అలా కటింగ్ చేయడం తప్పేనని అన్నారు.
ఇదే విషయంపై ఉపాధ్యాయురాలిని అడిగితే.. ఎన్నో రోజుల నుంచి పిల్లలు క్రమశిక్షణగా లేరని అన్నారు. జుట్టు కత్తిరించుకోవాలని ఎన్ని సార్లు చెప్పినా వినడం లేదని అన్నారు. దీంతో జుట్టు కత్తిరించవలసి వచ్చిందని చెప్పారు. అయితే తల్లిదండ్రులు ఆందోళన చేయడంతో ఆమె క్షమాపణ చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తాము తల నీలాల కోసం జుట్టు పెంచుకున్నామని చెబుతన్నా వినకుండా టీచర్ జుట్టు కత్తిరించారని అన్నారు. అయితే ఈ క్యాప్ పెట్టుకుంటే సరిపోతుందని చెబుతూ జుట్టు కత్తిరించారన్నారు.
ఈ సంఘటన ఎంఈవో వద్దకు చేరగా జుట్టు కత్తించిన విషయంపై తమకు ఇప్పటి వరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, తన దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే పెరువంచ టీచర్ విద్యార్థుల జుట్టు కత్తించిన సంఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకొని ఆమెను APCS (CCA) రూల్స్ ప్రకారం సస్పెండ్ చేసినట్లు తెలిపారు. దీనిపై కొందరు రకరకాల చర్చలు పెడుతున్నారు. విద్యార్థుల విషయంలో సున్నితంగా వ్యవహరించాలని చెబుతున్నారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని ఎన్నో ఆశలతో పాఠశాలకు విద్యార్థులు వస్తారని, వారిపై ఇలాంటి చేష్టల వల్ల ఉపాధ్యాయులపై చెడు ప్రభావం పడుతుందని అన్నారు.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: Khammam the lady teacher who cut the hair of the school children no suspension
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com