Rythu Bharosa: తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే.. రైతులకు ప్రస్తుతం ఇస్తున్న పెట్టుబడి సాయానికి రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈమేరకు ఆరు గ్యాంరటీల్లో చేర్చింది. 2023 డిసెబర్‌లో బాధ్యతలు చేపట్టిన వెంటనే యాసంగి పంటకు పాత పద్ధతిలోనే రైతుబంధు చెల్లించింది. అయితే పదెకరాలలోపు వారికే పెట్టుబడి సాయం అందింది. ఇక వానాకాలంలో పంట రుణాల మాఫీ కోసం పెట్టుబడి సాయం అందించలేదు. దీంతో రేవంత్‌సర్కార్ పెట్టుబడి సాయం ఎత్తేయాలని చూస్తుందని ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ ఆరోపిస్తున్నాయి. ఈ తరుణంలో ఈ యాసంగికి రైతు భరోసా కింద పెట్టుబడిసాయం అందించేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా కింద పెట్టుబడి అందిస్తామని తెలిపింది. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రకటించారు.
బీఆర్‌ఎస్‌కు షాక్ ఇచ్చేలా..
సంక్రాంతి తర్వాత ఇస్తామన్న రైతుభరోసా పెట్టుబడిని ముందే ఇచ్చి ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు షాక్ ఇవ్వాలని చూస్తోంది రేవంత్ సర్కార్. ఈమేరకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈనెల 28న లబ్ధిదారుల ఖాతాల్లో పెట్టుబడిసాయం జమ చేసేలా కార్యచరణ రూపొందిస్తున్నారు. రైతు భరోసాలో భాగంగా రైతులకు, కౌలు రైతులకు పెట్టుబడి ఇచ్చేందుకు సిద్ధమైందని తెలిసింది. ఈనెల 28న అర్హులైన కౌలు రైతులు, రైతు కూలీల ఖాతాల్లో పెట్టుబడి జమ చేయాలని నిర్ణయిచంఇంది. ఇందుకు రూ.6 వేల కోట్లు అవసరమని నిర్ధారించింది. ఇందుకు రూ.7 వేల కోట్లు సమీకరించేందుకు సిద్ధమైంది.
మాచ్చి 31 వరకు గడువు..
వాస్తవానికి రైతు భరోసా పథకాన్ని సంక్రాంతి తర్వాత ప్రారంభిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అయితే ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. ఈ నేపథ్యంలో రైతులకన్నా ముందు కౌలు రైతులు, రైతు కూలీలకు పెట్టుబడి ఇవ్వాలని నిర్ణయించారు. రైతు భరోసా చెల్లింపుకు మార్చి 31 వరకు సమయం ఉంది. కానీ బీఆర్‌ఎస్ అంత టైం ఇవ్వకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. అందుకే డిసెంబర్ 28 రైతు కూలీలు, కౌలు రైతులకు రూ.6 వేల చెప్పున ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. రైతులకు సంక్రాంతి తర్వాత రూ.7,500 చొప్పున చెల్లిస్తారు.
రైతు కూలీలు వీరే..
ఇక రైతు కూలీలు ఎవరు అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఎలాంటి భూమి లేకుండా పొలాల్లో పనిచేసేవారు రైతు కూలీలు. వీరికి ఏటా రూ.12 వేలు ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.6 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. కౌలు రైతులు ఇతరుల పొలాన్ని లీజుకు తీసుకుని పంటలు సాగుచేస్తారు. వీరికి కూడా ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈసారి రూ.6 వేలు ఇవ్వనుంది. ఇక రైతులకు రైతుభరోసా కింద ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని తెలిపింది. ఈ యాసంగికి రూ.7,500 ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలో 1.10 కోట్ల మందికి లబ్ధి కలుగుతుందని అంచనా వేసింది.