https://oktelugu.com/

Allu Arjun: అల్లు అర్జున్ ని వెంటాడుతున్న రేవంత్ సర్కార్.. నేడు పోలీస్ స్టేషన్లో విచారణ.. ఆయన్ని విచారించేది ఎవరో తెలుసా!

సంధ్య థియేటర్ వివాదం నుండి అల్లు అల్లు అర్జున్ ఇప్పట్లో బయటపడే సూచనలు కనిపించడం లేదు. ఈ కేసును తెలంగాణ గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకుంది. అల్లు అర్జున్ ని నేడు మరోసారి విచారించనున్నారు. అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఎవరు విచారించనున్నారో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : December 24, 2024 / 10:50 AM IST

    Allu Arjun(13)

    Follow us on

    Allu Arjun: అల్లు అర్జున్ కి కష్టాలు కొనసాగుతున్నాయి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో ఏ 11గా ఉన్న అల్లు అర్జున్ ని నేడు మరోసారి విచారించనున్నారు. ఈ మేరకు పోలీసులు అల్లు అర్జున్ కి నోటీసులు జారీ చేశారు. BNS 35 (3) సెక్షన్ క్రింద అల్లు అర్జున్ ని పోలీసులు విచారణకు పిలిచారు. అల్లు అర్జున్ తన లీగల్ టీమ్ తో ఈ విచారణలో పాల్గొననున్నారు. ఇటీవల ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ పై కూడా పోలీసులు వివరణ కోరనున్నారట.

    కీలకమైన 10 ప్రశ్నలు సిద్ధం చేశారట. ఇక అల్లు అర్జున్ ని ఎవరు విచారిస్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది. చిక్కడపల్లి ఏసీపీ రమేష్, సీఐ రాజు విచారణ చేపడతారట. వీరిద్దరి అద్వైర్యంలో అల్లు అర్జున్ విచారణ సాగనుందట. అనంతరం అల్లు అర్జున్ ని సీన్ కంస్ట్రక్షన్ కోసం సంధ్య థియేటర్ కి తీసుకెళ్లే అవకాశం కలదని అంటున్నారు. నేడు జరగనున్న అల్లు అర్జున్ విచారణ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.

    ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు అల్లు అర్జున్ పై మాటల దాడికి దిగారు. మహిళ మృతికి అల్లు అర్జునే కారణం అంటూ విమర్శలు గుప్పించారు. ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ సభ్యులు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారు. అనంతరం అరెస్ట్ అయ్యారు. గంటల వ్యవధిలో బెయిల్ పై విడుదలయ్యారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాధితురాలు రేవతి కుటుంబానికి కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫాండషన్ తరపున రూ. 25 లక్షల ఆర్థిక సహాయం చేశాడు.

    అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి రూ. 20 కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక నేడు విచారణలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్ కి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం.