https://oktelugu.com/

KCR : హవ్వా..కేసీఆర్ సారూ ప్రధాని అట.. నవ్విపోదురుగాక..!

రాను రాను కేసీఆర్ వ్య‌వ‌హార శైలి ప్ర‌జా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ను మైమ‌ర‌పిస్తున్నాడ‌ని విమ‌ర్శిస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : May 11, 2024 / 08:42 PM IST

    KCR's statement that he will become the Prime Minister is ridiculous

    Follow us on

    KCR : చింత చచ్చినా పులుపు చావదంటారు పెద్దలు. ఇప్పుడు సరిగ్గా ఈ మాటలు బీఆర్ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సరిపోయేలా ఉన్నయ్. బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం పీకల్లోతు క‌ష్టాల్లో ఉంది. కీలకమైన నేతలు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా బారాసను వీడుతున్నారు. కేసీఆర్ బుజ్జగింపులను సైతం వారు అస్సలు పట్టించుకోవడం లేదు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ పార్టీలో ఎంతమంది ఉంటారో..ఎంతమంది కాంగ్రెస్,బిజెపిల్లోకి జంప్ అవుతారో చెప్పలేని పరిస్థితి. ఇక‌ క్షేత్రస్థాయిలోని క్యాడర్ కూడా అధికార పార్టీ వైపు చూస్తున్నారు. ఒక రకంగా తెలంగాణలోని లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను బిజెపి గనుక గెలుచుకుంటే భారాస‌ను ఆ పార్టీ పోతం పెట్టే పనికి శ్రీకారం చుట్టొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది.

    అయితే హైదరాబాద్,ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో ఈ రకమైన ప్రచారం జరుగుతుండగా..తాజాగా బీఆర్ఎస్ అధినేత,మాజీ సీఎం కేసిఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాస్యాస్పదంగా మారాయి. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితే అసలు బాగోలేదంటే..కేసిఆర్ మాత్రం తనకేం తక్కువ ముఖ్యమంత్రిని కాకపోతే ఏంటి అవకాశం వస్తే ఢిల్లీలో చక్రం తిప్పి ప్రధానమంత్రిని అవుతాన‌ని చెబుతుండ‌డం విస్మయం కలిగిస్తోంది. వాస్తవానికి ఈసారి జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం అంతంతేననే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ పార్టీకి ఒకటి లేదా రెండు స్థానాల కంటే ఎక్కువ రాకపోవచ్చనే చర్చ నడుస్తుంది. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో పోటీ బిజెపి వర్సెస్ కాంగ్రెస్ మధ్యేనని మెజార్ట్ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

    మ‌రోవైపు ఒకానొక దశలోనైతే కొన్ని మీడియా సంస్థలు లోక్సభకు జరుగన్నన్న‌ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బిజెపి 08,కాంగ్రెస్ 08 సీట్లను కైవసం చేసుకోవచ్చనే ప్రసారం చేశాయి. అయితే ఇంతలా రాజకీయం ప్రతికూల పరిస్థితులు ఉన్న ప్రస్తుత త‌రుణంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తున్నాయి. బీఆర్ఎస్కు రాజకీయంగా పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేనప్పుడు ఆ పార్టీ అధినేతగా కేసీఆర్ లోక్సభ ఫలితాల తర్వాత అవకాశం ఉంటే తానే ప్రధానిని కావచ్చునని మీడియా ముందు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం ఆయన సహజ శైలిని, వ్యవహార తీరును మరింతగా నవ్వులపాలు చేస్తుంది. గతంలో కూడా అనేకసార్లు ఇలాంటి ముచ్చట్లే చెప్పిన కేసీఆర్..అప్పట్లో పబ్లిక్ ను నమ్మించగలిగి ఓట్లు దండుకున్నప్పటికిని.. ప్రస్తుత పరిస్థితిలో ఆయన మాటలు ఏవీ నమ్మశక్యంగా లేకపోవడం..అవకాశం వస్తే తానే ప్రధానిని అవుతానని చెప్పడం చిత్ర‌,విచిత్రంగా అనిపిస్తోంది. అందుకే ఒకటి..రెండు ఎంపీలు గెల‌వ‌లేకున్నా..మీరు అనుకుంటే దేశానికి ప్ర‌ధాని కావ‌డం అంత క‌ష్ట‌మేమీ కాద‌ని పొలిటిక‌ల్ అన‌లిస్టులు సెటైర్లు వేస్తున్నారు. రాను రాను కేసీఆర్ వ్య‌వ‌హార శైలి ప్ర‌జా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ను మైమ‌ర‌పిస్తున్నాడ‌ని విమ‌ర్శిస్తున్నారు.