https://oktelugu.com/

Puri Jagannath : బాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్న పూరి జగన్నాథ్… స్టోరీ ఏంటంటే..?

కమర్షియల్ గా ఒక సినిమాను సూపర్ సక్సెస్ చేసి తనకు మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఆయన సినిమాలో హీరోగా చేసిన వాళ్లకు కూడా ప్రత్యేకమైన గుర్తింపు వచ్చే విధంగా ఆయన సినిమాలను తీర్చిదిద్దుతూ ఉంటాడు...

Written By:
  • NARESH
  • , Updated On : May 11, 2024 / 08:34 PM IST

    Puri Jagannath

    Follow us on

    Puri Jagannath : ఒక సినిమాలో హీరో అంటే రాముడు మంచి బాలుడు అనే క్యారెక్టర్ ని డిజైన్ చేసి సినిమాలు చేయాలి. అలా అయితేనే ప్రేక్షకులు మన సినిమాలను ఆదరిస్తారు అనే ఒక మూస ధోరణికి స్వస్తి పలుకుతూ కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ ‘ఇడియట్ ‘ లాంటి సినిమా చేసి మంచి గుర్తింపు ను సంపాదించుకున్న దర్శకుడు పూజ జగన్నాథ్… నిజానికి ఆయన సినిమా టైటిల్స్ అన్ని బూతులే ఉంటాయి. అయినప్పటికీ ఆయన సినిమాలో మాత్రం హీరో క్యారెక్టర్జేషన్ చాలా స్పెషల్ గా ఉంటుంది. అందుకే ఆయన సినిమాని చూడడానికి సగటు ప్రేక్షకుడు ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటాడు.

    ఇక ఆయన డైరెక్షన్ లో నటించడానికి ప్రతి హీరో కూడా ఎదురుచూస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు ఆయన ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే తను మరోసారి పాన్ ఇండియాలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే పూరి జగన్నాథ్ తో సినిమా చేయడానికి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ పోటీ పడుతున్నారు.

    ఇక అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన డబుల్ ఇస్మార్ట్ సినిమా అయిపోయిన తర్వాత అజయ్ దేవగన్ తో ఒక భారీ యాక్షన్ సినిమాని తెరకెక్కించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. అయితే ‘లైగర్ ‘ సినిమా తర్వాతే అజయ్ దేవగన్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఒక సినిమా రావాల్సింది. కానీ అనుకోని కారణాలవల్ల ఈ ప్రాజెక్టు అయితే ఆగిపోయింది. ఇక ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో ఈ సినిమాని తెరకెక్కించి సూపర్ సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు.

    అయితే ఈ సినిమాలో అజయ్ దేవగన్ ఒక ఫారెస్ట్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఇక ఇది ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ గా వార్తలైతే వస్తున్నాయి. మరి పూరి జగన్నాథ్ కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరు..కాబట్టి కమర్షియల్ గా ఒక సినిమాను సూపర్ సక్సెస్ చేసి తనకు మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఆయన సినిమాలో హీరోగా చేసిన వాళ్లకు కూడా ప్రత్యేకమైన గుర్తింపు వచ్చే విధంగా ఆయన సినిమాలను తీర్చిదిద్దుతూ ఉంటాడు…