AP Elections 2024 : మెగా ఫ్యామిలీ లో చిచ్చు పెడుతున్న అభిమానులు.. ఈ ఒక్కటి తెలుసుకుంటే మంచిది..

కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి ఎలక్షన్స్ ని సాఫీగా సాగనిస్తే బెటరని చాలామంది సినీ ప్రముఖులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు...

Written By: NARESH, Updated On : May 11, 2024 8:50 pm

Mega Family

Follow us on

AP Elections 2024 : ఈనెల 13వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రతి పార్టీ గెలుపొందాలనే ఉద్దేశ్యంతో ఇప్పటికే భారీ ఎత్తున ప్రచారాలను కొనసాగిస్తున్నారు. ఇక అందులో భాగంగానే జనసేన పార్టీ అధ్యక్షుడు అయిన పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేస్తున్నాడు. అయితే ఇప్పటికే చాలామంది సినీ సెలబ్రిటీలు సైతం తనకు మద్దతు పలకడం మనం చూశాం.

ఇక అందులో భాగంగానే జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా ఆయన కోసం ప్రచారాలు నిర్వహిస్తున్నారు. మెగా ఫ్యామిలీ హీరోలు అయిన వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లాంటి వాళ్లు ప్రచారాలను నిర్వహించారు. ఇక అందులో భాగంగానే రామ్ చరణ్ చిరంజీవి లు కూడా ఈరోజు సతి సమేతంగా పిఠాపురం నియోజకవర్గానికి వెళ్లి ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. ఇక అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ గెలవాలని కోరుకుంటున్నాను అని రీసెంట్ గా ఒక ట్వీట్ కూడా చేశాడు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఈరోజు అల్లు అర్జున్ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి అయిన రవి ని సతి సమేతంగా వెళ్లి కలిశాడు.

నిజానికి రవి వైసిపి అభ్యర్థి అయిన కూడా అల్లు అర్జున్ కి ఫ్రెండ్ కావడం వల్ల ఆయన తనని వెళ్లి కలిసి ఆయనకి ఓట్లు వేసి గెలిపించవలసిందిగా అక్కడున్న నియోజకవర్గ ప్రజలకు తెలియజేశారు. ఇక దాంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ పైన తీవ్రమైన ఆగ్రహానికి గురవుతున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తుంటే అల్లు అర్జున్ వెళ్లి వైసీపి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటి అనే ఉద్దేశ్యంలో వాళ్ళు తీవ్రమైన విమర్శలను గుప్పిస్తూ అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లైతే పెడుతున్నారు. ఇక దీని లో మనం గమనించాల్సింది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ అంటే అల్లు అర్జున్ కు ఇష్టమే అందుకే పవన్ కళ్యాణ్ గెలుపుని కోరుకున్నాడు.

కానీ రవి అనే వ్యక్తి అల్లు అర్జున్ స్నేహితుడు కాబట్టి ఆయన కూడా గెలవాలనే ఉద్దేశ్యంతోనే తనని వెళ్లి కలిశాడు. అంతే తప్ప వైసీపీ పార్టీ మొత్తం గెలవాలని ఉద్దేశ్యం అల్లు అర్జున్ కి లేదు. రవి ఒక్కడే గెలవాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే అల్లు అర్జున్ తనని నమ్మిన వాళ్లు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటాడు. కాబట్టే రవి గెలవాలనే ఉద్దేశ్యంతో మాత్రమే ఆయన దగ్గరికి వెళ్ళాడు తప్ప వైసీపి పార్టీకి సపోర్ట్ చేయడానికి కాదు అనే ఒక చిన్న విషయాన్ని జనసేన పార్టీ కార్యకర్తలు గాని, పవన్ కళ్యాణ్ అభిమానులు గాని గుర్తుంచుకుంటే మంచిది… దీనివల్ల ఇటు అల్లు అర్జున్ అభిమానులకి, అటు పవన్ కళ్యాణ్ అభిమానులకి తీవ్రమైన గొడవలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి ఎలక్షన్స్ ని సాఫీగా సాగనిస్తే బెటరని చాలామంది సినీ ప్రముఖులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…