https://oktelugu.com/

CM KCR: కేసీఆర్ కు దారేది..?

CM KCR: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రాజకీయ వేడి తీవ్రమైంది. ఇక్కడ పట్టు సాధించడానికి బీజేపీ.. ఉన్నది కాపాడుకోవడానికి టీఆర్ఎస్ చేస్తున్న పోరాటంలో అనేక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల బీజేపీ తెలంగాణలో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించిన తరువాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఇక్కడ అధికారంలో ఉన్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్నట్లు ప్రకటించారు. అందుకు సంబంధించిన కార్యాచరణను కూడా ప్రారంభించారు. కానీ బీజేపీ దూకుడు చూసి […]

Written By:
  • NARESH
  • , Updated On : July 5, 2022 / 10:35 AM IST
    Follow us on

    CM KCR: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రాజకీయ వేడి తీవ్రమైంది. ఇక్కడ పట్టు సాధించడానికి బీజేపీ.. ఉన్నది కాపాడుకోవడానికి టీఆర్ఎస్ చేస్తున్న పోరాటంలో అనేక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల బీజేపీ తెలంగాణలో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించిన తరువాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఇక్కడ అధికారంలో ఉన్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్నట్లు ప్రకటించారు. అందుకు సంబంధించిన కార్యాచరణను కూడా ప్రారంభించారు. కానీ బీజేపీ దూకుడు చూసి ఒక్కసారిగా ఆయన యూటర్న్ అయినట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయాలు దేవుడెరుగు సొంత రాష్ట్రంలో పార్టీని కాపాడుకోవడానికి ఆయన మనసు మార్చుకున్నట్లు టీఆర్ఎస్ వర్గాల్లో తీవ్చ చర్చ సాగుతోంది.

    CM KCR

    కొన్ని నెలలుగా కేసీఆర్ బీజేపీతో వీరోచిత పోరాటం చేస్తున్నారు. వడ్ల కొనుగోలు విషయంలో బీజేపీతో వివాదం ఏర్పడిన తరువాత కేసీఆర్ జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి వరకు రాష్ట్ర విషయాలు మాట్లాడే గులాబీ నేత అప్పటి నుంచి జాతీయ స్థాయిలో పర్యటనలు చేశారు. పంజాబ్ రైతులకు రూ.3 లక్షల చొప్పున సాయం చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేంద్రంలో మోదీకి ప్రత్యామ్నాయంగా కేసీఆర్ ఉంటారని పలుసార్లు ప్రకటన చేశారు. కేసీఆర్ నడుస్తున్న విధానం చూసి ఇతర పార్టీలు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి. దీంతో కొన్ని పార్టీలు ఆయనకు సపోర్టుగా ఉండేందుకు ముందుకు వచ్చాయి.

    Also Read: Copenhagen Shooting: ఆగని గన్ కల్చర్: అమెరికాలో కాల్పుల మోత.. మృత్యుఘోష..

    ఇదే సమయంలో బీజేపీ ఉత్తరాది రాష్ట్రాల్లో దాదాపు జెండా ఎగరవేస్తూ వస్తోంది. ఇటీవల మహారాష్ట్రలోనూ పరోక్షంగా అధికారం చేజిక్కించుకుంది. ఇక దక్షిణాదిలో ప్రాంతాల్లో పట్టు సాధించాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందుకు తెలంగాణనే సరైన మార్గమని భావించిన బీజేపీ అగ్రనాయకులు హైదరాబాద్ లో జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించారు. అయితే బీజేపీకి ఊహించని స్పందన వచ్చింది. కనీసం హోర్డింగ్, ప్రచారానికి అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ అడ్డుకున్నప్పటికీ.. అశేష జనం హాజరు కావడంతో అందరూ షాక్ కు గురయ్యారు. దీంతో బీజేపీకి కేడర్లో ఉత్సాహం రావడంతో పాటు రాష్ట్రంలోనూ రాజకీయంగా చర్చ ప్రారంభమైంది.

    Modi

    ఇక ఎన్డీయే అభ్యర్థిని కాదని ఉపరాష్ట్రపతి అభ్యర్తి యశ్వంత్ సిన్హాకు మద్దతునిచ్చిన కేసీఆర్..ఆయనను స్వయంగా తెలంగాణకు ఆహ్వానించారు. దీంతో ఒకరోజు ముందు వరకు టీఆర్ఎస్ లోనూ ఇక మనం జాతీయ స్థాయిలో ఎదిగేందుకు మార్గం దొరికిందని భావించారు. కానీ బీజేపీ సమావేశాలు నిర్వహించిన తరువాత ఆ జోష్ టీఆర్ఎస్ లో తగ్గినట్లు తెలుస్తోంది. ఎందుకంటే హైదరాబాద్ లో మోదీ ప్రసంగంలో ఎక్కడా కేసీఆర్ పేరు వాడకపోవడంతో పాటు ఎలాంటి పరుష వ్యాఖ్యలు చేయలేదు. దీంతో అప్పటి వరకు వివాదాల పార్టీ అని భావించిన కొందరు అభివృద్ధి విషయంలోనూ బీజేపీ సరైనదేనని భావిస్తున్నారు.

    ఇలాంటి తరుణంలో తెలంగాణలో పార్టీ కేడర్ తో పాటు రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు వెళ్లే అవకాశం ఉందని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీంతో ఇప్పుడు జాతీయ రాజకీయాలు కాకుండా సొంత రాష్ట్రంలో ముందు పట్టు సాధించాలని కేసీఆర్ అనుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతానికి ‘బీఆర్ఎస్’ ఆలోచనను పక్కనబెట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే సాధారణ ఎన్నికల వరకు కేసీఆర్ బీఆర్ఎస్ ను ముందుకు తీసుకెళ్తారా..? లేక ఆ విషయాన్ని కనుమరుగు చేస్తారా..? అనేది చర్చనీయాంశంగా మారింది.

    Also Read: PM Modi- YS Jagan: ఏపీలో బీజేపీ మార్కు రాజకీయం… వారిద్దరికంటే జగనే మేలంటున్న మోదీ, షా ద్వయం

    Tags