Kavitha questions: అవే ప్రశ్నలు.. వేదిక మాత్రమే మారుతుంది.. కవిత సంధించే తీరు మాత్రం మారడం లేదు.. ప్రతి విషయంలో కూడా ఆమె గులాబీ పార్టీ తప్పులను వేలెత్తి చూపిస్తోంది.. ప్రాజెక్టుల నుంచి మొదలుపెడితే రోడ్ల వరకు ప్రతి విషయంలోనూ ఆమె స్పష్టంగా మాట్లాడగలుగుతుంది. జూబ్లీహిల్స్ ఓటమి తర్వాత కవిత మరింత ఘాటుగా స్పందిస్తోంది. గులాబీ పార్టీ మీద విమర్శలు చేస్తోంది. వాస్తవానికి ఈ విమర్శలకు సమాధానం చెప్పాల్సిన స్థితి నుంచి గులాబీ పార్టీ నేతలు కవితను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుంటున్నారు.. ఓ గులాబీ పార్టీ నాయకుడు అయితే ఏకంగా కవితను రాక్షసి అని సంబోధించాడు.. వాస్తవానికి కేసీఆర్ బతికి ఉండగానే కెసిఆర్ కుమార్తెను సొంత పార్టీ వాళ్లు తిడుతుండడం.. ఇంతకంటే దారుణం మరొక నాయకుడికి ఉండదు.
కవిత పదేపదే హరీష్ రావును లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తోంది.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓడిపోవడం కంటే పెద్ద అభిమానం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఉండదని కవిత ఆరోపించింది.. హరీష్ రావును మోసగాడు అని చెబుతున్న కవిత.. అతడు రేవంత్ రెడ్డికి టచ్ లో ఉన్నాడని ఆరోపిస్తోంది.. పార్టీలో ఉంటూ పార్టీని నిండా ముంచేస్తున్నాడని విమర్శిస్తోంది.. అంతేకాదు కేటీఆర్, హరీష్ రావు తమ భుజాల మీద గులాబీ పార్టీని మోస్తున్నట్టు.. కెసిఆర్ ను కాపాడుకుంటున్నట్టు బిల్డప్ ఇస్తున్నారని.. కానీ కెసిఆర్ ముందు తూగలేరనే విషయాన్ని వారిద్దరు మర్చిపోతున్నారని కవిత ఆరోపించారు.. కృష్ణార్జునల మని ఇద్దరు చెప్పుకుంటున్నారు.. వాస్తవానికి క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదని.. ఒకరి మీద మరొకరు బాణాలు వేసుకుంటున్నారని.. ఫలితంగా క్యాడర్ మొత్తాన్ని నాశనం చేస్తున్నారని కవిత ఆరోపిస్తున్నారు
గులాబీ పార్టీ బలం మొత్తం సోషల్ మీడియాలో మాత్రమే కనిపిస్తోందని.. క్షేత్రస్థాయిలో అంత సన్నివేశం లేదని కవిత మండిపడుతున్నారు. రీజినల్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల హరీష్ రావు, గంగుల కమలాకర్, నవీన్ రావ్ కు భూములు ఉన్నాయని.. వాటిని కాపాడుకోవడం కోసం రోడ్డు అలైన్మెంట్ మార్చేశారని కవిత ఆరోపించారు. అంతేకాదు రీజినల్ రింగ్ రోడ్ వల్ల రెడ్డిపల్లి గ్రామంలో సుమారు 56 మంది రైతులు తమ 59 ఎకరాల భూములను కోల్పోయారని.. ఈ విషయాలు కేసీఆర్ కు తెలియకుండా హరీష్, ఇతర నేతలు చూశారని.. అందువల్ల మెదక్ జిల్లాలో గులాబీ పార్టీ దారుణంగా ఓడిపోయిందని కవిత సంచలన ఆరోపణలు చేశారు.
కవిత ఇంటిపేరు కల్వకుంట్ల కాబట్టి.. కెసిఆర్ కుమార్తె కాబట్టి ఆమె చేస్తున్న ఆరోపణలన్నీ కూడా తెలంగాణ వ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి. వాస్తవానికి ఆమె మాట్లాడుతున్న మాటలు సంచలనంగా ఉన్నాయి. ఇప్పటికే చాలామంది బాధితులు కవితని కాలుస్తున్నారు.. కవిత చేస్తున్న ఆరోపణలపై గులాబీ పార్టీ నాయకులు కేవలం వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకొని కౌంటర్ ఇస్తున్నారు. అంతేతప్ప కవిత చేసిన విమర్శలకు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. కవిత గులాబీ పార్టీ చేసిన తప్పులను మొత్తం బయటపెడుతున్న నేపథ్యంలో కేడర్ మొత్తం అయోమయంలో ఉంది. తీవ్ర నిరాశ నిస్పృహల మధ్య వారంతా కూడా తనవైపు వస్తున్నారని కవిత చెబుతున్నారు.. కవిత చేస్తున్న ఆరోపణలు గులాబీ పార్టీలో ఉన్న అసలు బాగోతాన్ని బయటపెడుతున్నాయి. వీటికి కౌంటర్ కాదు కదా కనీసం సరైన స్థాయిలో సమాధానం ఇచ్చే స్థితిలో కూడా గులాబీ పార్టీ లేకపోవడం అత్యంత బాధాకరం.