Nagababu Bigg Boss 9: నిన్న గాక మొన్న మొదలైనట్టు అనిపిస్తున్న బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) అప్పుడే క్లైమాక్స్ కి చేరుకుంది. ఈ సీజన్ గత రెండు సీజన్స్ కంటే టీఆర్ఫీ రేటింగ్స్ విషయం లో బ్లాక్ బస్టర్ అని అంటున్నారు విశ్లేషకులు. హౌస్ లో జరిగే ఫిజికల్ టాస్కుల కంటే, కంటెస్టెంట్స్ మధ్య డ్రామా, ఎమోషన్స్ బాగా వర్కౌట్ అవ్వడం తో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సీజన్ ని బాగా చూస్తున్నారు. అందుకే పెద్ద సూపర్ హిట్ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ లో నలుగురి స్పాట్స్ ఫిక్స్ అయిపోయాయి. తనూజ, కళ్యాణ్, ఇమ్మానుయేల్ మరియు డిమోన్ పవన్ వంటి వారు టాప్ 5 లో తమ స్థానాలను పదిలం చేసుకున్నారు. ఇక మిగిలిన కంటెస్టెంట్స్ లో 5వ స్థానాన్ని అందుకునే అవకాశాలు ఎక్కువగా భరణి కి ఉన్నాయి.
5వ వారం లో ఎలిమినేట్ అయిన భరణి, మళ్లీ ఆరవ వారం లో రీ ఎంట్రీ ఇచ్చాడు. రీ ఎంట్రీ తర్వాత ఆయన గ్రాఫ్ బాగా పెరిగింది. రీ ఎంట్రీ ఇచ్చిన మొదటి వారం లో కాస్త పాత భరణి నే కనిపించాడు కానీ, ఆ తర్వాత నెమ్మదిగా తనని తానూ మార్చుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడిప్పుడే నామినేషన్స్ సమయం లో కూడా ఆయన స్వరం బాగా పెరిగింది. రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు మొదటి రోజు బిగ్ బాస్ నిర్వహించిన టాస్కుల్లో భరణి గట్టిగా ఆడడం వల్ల స్విమ్మింగ్ పూల్ లో దారుణంగా పడిపోతాడు. ఆ కారణం చేత ఆయన ఛాతికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. అప్పటి నుండి టాస్కులు ఆడే విషయం లో కాస్త జాగ్రత్త వహిస్తూ వస్తున్నాడు. జాగ్రత్త వహించినప్పటికీ కూడా తన వైపు నుండి నూటికి నూరు శాతం బెస్ట్ ఇవ్వడం లో అసలు తగ్గడం లేదు.
ఇదంతా పక్కన పెడితే భరణి కి మెగా బ్రదర్ నాగబాబు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నాగబాబు కి ఎల్లప్పుడూ కుడిభుజం లాగా ఉంటాడు భరణి. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే ముందు కానీ, హౌస్ లోపలకు వచ్చినప్పుడు కానీ భరణి ఎక్కడా కూడా నాగబాబు పేరు ని ఉపయోగించలేదు. కానీ ఈ వారం ఫ్యామిలీ వీక్ అనే సంగతి మన అందరికీ తెలిసిందే. వీకెండ్ కి కంటెస్టెంట్స్ కి సంబంధించిన స్నేహితులు, బంధువులు కూడా వస్తారు. భరణి కి ఆయన కూతురు హౌస్ లోకి రాబోతుంది అట. అదే విధంగా వీకెండ్ కి నాగబాబు భరణి కోసం స్టేజి మీదకు వచ్చి మాట్లాడుతాడట. ఇదే కనుక జరిగితే భరణి టాప్ 3 కి వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ ఓట్లు మొత్తం ఆయనకు దండిగా వచ్చి పడుతాయి. ప్రస్తుతం ఆయనకు బలమైన ఓటింగ్ పడడానికి కారణం కూడా మెగా ఫ్యాన్స్ అని అంతా అంటుంటారు, దివ్వెల మాధురి అయితే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత నాగబాబు రికమండేషన్ వల్లే భరణి హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు అంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది. ఇప్పుడు ఇలా పబ్లిక్ గా నాగబాబు స్టేజి మీదకు వచ్చి సపోర్ట్ చేస్తే ఎలాంటి పరిణామాలు రాబోతున్నాయి చూడాలి మరి.