Revanth Reddy Sensational Comments on KCR: వెనుకటి కాలంలో రాజకీయ నాయకులు తమ ప్రత్యర్థుల మీద విమర్శలను సహేతుకంగా చేసుకునేవారు. విధానపరంగా ఆరోపణలు చేసేవారు.. ఆ రాజకీయాలు అక్కడితోనే ఆగిపోయేవి. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే నేతల మధ్య వాదాలు సంవాదాలు ఉండేవి. మిగతా సందర్భాల్లో నాయకులు పెద్దగా విమర్శలు చేసుకునే వారు కాదు. ఆరోపణలు అంతకన్నా చేసుకునేవారు కాదు. స్నేహంగా మెదిలేవారు. బంధుత్వాలనూ కొనసాగించేవారు. అందువల్లే నాడు రాజకీయాలు గొప్పగా చెప్పుకునే విధంగా ఉండేవి. రాజకీయ నాయకులను గొప్పవాళ్లుగా పరిగణించే పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు భూతద్దం పెట్టి చూసినా కనిపించడం లేదు. పైగా రాజకీయ నాయకులు రాజకీయాలను వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు.. అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులను కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. దీంతో రాజకీయ నాయకులు మాట్లాడుతుంటేనే చూడలేని పరిస్థితి నెలకొంది..
గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతిపక్షాల మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తీవ్రస్థాయిలో తిట్టేవారు. ప్రధానమంత్రిని ఏకవాక్య సంబోధన చేసేవారు. రాజకీయ ప్రయోజనాల కోసం తాడూ బొంగరం లేని లెక్కలు చెప్పి.. దేశం మొత్తం ఆగమైపోతోందని.. దేశానికి తమ పార్టీని దిక్కు అన్నట్టుగా మాట్లాడేవారు. ఏదైనా మీడియా సంస్థ ఆయనకు వ్యతిరేకంగా వార్తలను గాని కథనాలను గాని ప్రచురించడం, ప్రసారం చేస్తే ఒంటి కాలు మీద లేచేవారు. శాపనార్ధాలు పెట్టేవారు. కెసిఆర్ వల్ల తిట్లు పడి.. ఇబ్బందులు పడి.. జైలు శిక్షలు అనుభవించి.. చివరికి ఎలాగోలా నిలదొక్కుకున్న రాజకీయ నాయకుల జాబితాలో రేవంత్ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. పరిపాలనలో తన మార్కు చూపించడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read: BRS vs Kavitha : ఏందీ ‘పంచాయితీ’ కవితక్కా!
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు.. చేస్తున్న పనులను సహజంగానే భారత రాష్ట్రపతి వ్యతిరేకిస్తోంది. తీవ్రస్థాయిలో తప్పుపడుతోంది. ఇక భారత రాష్ట్ర సమితికి అనుకూలంగా ఉండే పత్రిక అడ్డగోలుగా వార్తలను రాస్తోంది.. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి వాటికి గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. తనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న భారత రాష్ట్ర సమితి నాయకులకు తిరుగులేని స్థాయిలో ఎదురు జవాబు చెబుతున్నారు.. ఒకప్పుడు ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మాట్లాడేవారు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి తన ధోరణి మార్చారు. ఆవేశంతో కాకుండా ఆలోచనతో మాట్లాడుతున్నారు. తనపై విమర్శలు చేస్తున్న వారికి ఆస్థాయిలోనే కౌంటర్ ఇస్తున్నారు. ఇటీవల తన విమర్శించిన ఓ నేతను ఉద్దేశించి రేవంత్ సాలిడ్ కౌంటర్ ఇచ్చారు..” గోదావరి నీటిని తీసుకురావడం అంటే మందు గ్లాసులో సోడా పోసినట్టు కాదు.. మూడు అడుగులు ఉన్న వ్యక్తి… ఆరడుగుల స్థాయిలో ఎగురుతున్నాడు. 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్న వ్యక్తి తన సొంత మండలానికి పోలీస్ స్టేషన్ సైతం తెచ్చుకోలేకపోయాడు. ఆయన నన్ను అడ్డుకుంటా అని ప్రతిజ్ఞ చేస్తున్నాడు. 10 సంవత్సరాలలో గోదావరి నీటిని తుంగతుర్తి ప్రాంతానికి ఎందుకు తీసుకురాలేదు.. మీ హయాంలో బెల్ట్ షాపులను తెరిస్తే.. మా హయాంలో రేషన్ షాపులు తెరిచాం. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అతని నేలమట్టం చేస్తామని” రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.. రేవంత్ రెడ్డి చేసిన విమర్శలను కాంగ్రెస్ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో తెగ తిప్పుతున్నారు. అయితే ఇటీవల కాలంలో భారత రాష్ట్ర సమితి నాయకులు ముఖ్యమంత్రిని ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. వాటన్నింటికీ ఈ వ్యాఖ్యల ద్వారా రేవంత్ గట్టి సమాధానం చెప్పినట్లు అయింది.