Kadiyam Srihari: కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి, కావ్య.. టికెట్ విషయంలో ఇంకా సస్పెన్సే?

ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. చేవెళ్ల భారత రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యుడిగా నిన్నటి వరకు కొనసాగిన రంజిత్ రెడ్డి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు..

Written By: Anabothula Bhaskar, Updated On : March 31, 2024 3:28 pm

Kadiyam Srihari

Follow us on

Kadiyam Srihari: స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య తెర దించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ దీప్ దాస్ మున్షీ వారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీహరి తో పాటు కొంతమంది అనుచరులు కూడా రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీప్ దాస్ మున్షీ కండువా కప్పడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్లమెంటు ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన రెండు నెలల దాకా కాంగ్రెస్ పార్టీ.. ఇతర పార్టీల నాయకులను ఇప్పట్లో తీసుకోబోమని ప్రకటించింది. కానీ దేశంలో బిజెపి అనుకూల పవనాలు వీస్తున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. అధికారంలో ఉన్న తెలంగాణలో అధిక సంఖ్యలో ఎంపీలను గెలుచుకోవాలని భావించిన కాంగ్రెస్ పార్టీ.. చేరికలకు పచ్చ జెండా ఊపింది.

ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. చేవెళ్ల భారత రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యుడిగా నిన్నటి వరకు కొనసాగిన రంజిత్ రెడ్డి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.. ఎన్నికల్లోనూ రంజిత్ రెడ్డి చేవెళ్ల పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. వికారాబాద్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె మల్కాజ్ గిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మీరు మాత్రమే కాకుండా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య కూడా ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకుముందు కడియం కావ్యను భారత రాష్ట్ర సమితి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలిపింది. అనూహ్య పరిస్థితుల్లో ఆమె వరంగల్ స్థానం నుంచి తప్పుకుంది. పైగా భారత రాష్ట్ర సమితి పనితీరుల ఉద్దేశించి హాట్ హాట్ గా కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ ను ఒక లేఖ రూపంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుకు పంపించింది.

కడియం శ్రీహరి, కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వరంగల్ పార్లమెంట్ స్థానం ఆమెకే కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దానికి సంబంధించి చర్చలు పూర్తయ్యాయని.. అధిష్టానం నుంచి బలమైన హామీ లభించడం వల్లే శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలుస్తోంది.. అయితే టికెట్ పై ఇంకా కావ్యకు కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తిస్థాయిలో స్పష్టమైన హామీ రాలేదని తెలుస్తోంది. కొందరేమో టికెట్ పై అధిష్టానం క్లారిటీ ఇవ్వడంతోనే భారత రాష్ట్ర సమితి అధినేత కేసిఆర్ కు కావ్య లేఖ రాసిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు తాము కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్తున్నాం అనే విషయంపై శ్రీహరి క్లారిటీ ఇచ్చారు. ఓడిపోయే పార్టీలో తన బిడ్డను పార్లమెంటు సభ్యురాలుగా పోటీ చేయించి.. ఆమె రాజకీయ జీవితాన్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదని శ్రీహరి వ్యాఖ్యానించారు. శ్రీహరి పార్టీలో చేరిన నేపథ్యంలో.. ఆమె కూతురికి టికెట్ ఇచ్చారని ప్రచారం జరుగుతున్న సమయంలో.. ఇన్నాళ్లపాటు వరంగల్ పార్లమెంట్ స్థానంపై ఆశలు పెంచుకున్న వారి పరిస్థితి ఏమిటనేది అంతు పట్టకుండా ఉంది. అయితే వారికి రేవంత్ ఏవైనా హామీలు ఇస్తారా? నామినేటెడ్ పోస్టుల్లో స్థానం కల్పిస్తారా? అనే ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సింది ఉంది.