spot_img
HomeతెలంగాణTRS Party Name Dispute: కవితకు ఎన్నికల సంఘం కోలుకోలేని షాక్‌..

TRS Party Name Dispute: కవితకు ఎన్నికల సంఘం కోలుకోలేని షాక్‌..

TRS Party Name Dispute: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తనయ, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ, భారత రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఎన్నికల సంఘం షాక్‌ ఇచ్చింది. పార్టీలో ఏర్పడిన అంతర్గత విభేదాలతో కవితను బీఆర్‌ఎస్‌(పాత టీఆర్‌ఎస్‌) నుంచి బయటకు పంపించారు. దీంతో తెలంగాణలో కొన్నాళ్లు పర్యటించిన కవిత. ఇటీవలే కొత్త పార్టీ పెట్టింది. తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్‌) ఏర్పాటు చేశారు. ఈమేరకు ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. పార్టీ జెండా, ఎజెండా కూడా కవిత ప్రకటించారు. ఈ పార్టీకి తెలంగాణ రాష్ట్ర హక్కుల పరిరక్షణ, ఉద్యమ వారసత్వం కొనసాగించడం వంటి లక్ష్యాలు ప్రకటించారు.

ఏప్రిల్‌ 25 పార్టీ ప్రకటన..
ఈ ఏడాది ఏప్రిల్‌ 25న మేడ్చల్‌లోని అద్వయ కన్వెన్షన్‌ సెంటర్‌లో కవిత తన కొత్త పార్టీని ప్రారంభించి, పేరును తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్‌) అని ప్రకటించారు. ఇది పాత టీఆర్‌ఎస్‌(తెలంగాణ రాష్ట్ర సమితి – ఇప్పుడు బీఆర్‌ఎస్‌) వారసత్వాన్ని ఉపయోగించుకునే ప్రయత్నంగా చూశారు. ఈ ప్రకటనతోనే రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. జనవరిలోనే కవిత ఎన్నికల సంఘానికి ఐదు ప్రత్యామ్నాయ పేర్లు సమర్పించారు. ఏప్రిల్‌ 25 ప్రకటన తర్వాత ఎన్నికల సంఘం పేరు సారూప్యత కారణంగా పరిశీలన చేపట్టింది. బీఆర్‌ఎస్‌ సహా కొన్ని పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. దీంతో ఎన్నికల సంఘం తెలంగాణ రక్షణ సేన అనే పేరుకు (ఆమె సమర్పించిన ఎంపికల్లో ఒకటి) ప్రాథమిక ఆమోదం ఇచ్చింది. ఏప్రిల్‌ 30న ఎన్నికల సంఘం అధికారులు బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి వెళ్లి లేఖ అందజేశారు.

ఈసీకి అభ్యంతరాల వెల్లువ
ప్రాథమిక ఆమోదం తర్వాత జూన్‌ 2026లో ఎన్నికల సంఘానికి 600 నుంచి 700 వరకు అభ్యంతరాలు వచ్చాయి. బీఆర్‌ఎస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. టీఆర్‌ఎస్‌ పేరు తెలంగాణ ఉద్యమంతో ముడిపడి ఉంది. గ్రామాల్లో ప్రజలు ఇప్పటికీ బీఆర్‌ఎస్‌ను టీఆర్‌ఎస్‌ గానే గుర్తిస్తున్నారు. కొత్త పార్టీకి ఇదే పేరు ఇస్తే ఓటర్లలో గందరగోళం కలుగుతుంది అని వాదించింది. మహారాష్ట్ర సోలాపూర్‌కు చెందిన మరో సంస్థ కూడా ఇదే పేరుపై హక్కు కోరుతూ దరఖాస్తు చేసింది. ఎన్నికల సంఘం ఇప్పటికీ అభ్యంతరాలను పరిశీలిస్తోంది. చివరి ఆమోదం ఇంకా పెండింగ్‌లో ఉంది.

మూడు ప్రత్యామ్నాయ పేర్లు కోరిన ఈసీ..
టీఆర్‌ఎస్‌పై తీవ్ర అభ్యంతరాలు ఉన్న నేపథ్యంలో ఈసీ కవితకు లేఖ రాసింది. 15 రోజుల్లో మూడు కొత్త పేర్లు సూచించాలని తెలిపింది. గడువులోగా పేర్లు ఇవ్వకుంటే పార్టీ దరఖాస్తు క్లోజ్‌ చేస్తామని పేర్కొంది. టీఆర్‌ఎస్‌ పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉండటం వల్ల బీఆర్‌ఎస్‌ అభ్యంతరం సహజం. కవిత ఈ పేరును ఉపయోగించడం ద్వారా పాత మద్దతుదారులను ఆకర్షించాలని భావించినట్లు కనిపిస్తోంది. అయితే ఓటర్ల అయోమయం నివారించడం ఎన్నికల సంఘం బాధ్యత. ఈ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కుటుంబ రాజకీయాల ప్రభావాన్ని, కొత్త పార్టీలు ఎదుర్కొనే సవాళ్లను గుర్తు చేస్తోంది. బీఆర్‌ఎస్‌కు ఇది మరిన్ని ఇబ్బందులు కలిగించవచ్చు. కవితకు ఇదిసొంత రాజకీయ గుర్తింపు నిర్మించుకునే అవకాశం. అభ్యంతరాలు తీరిన తర్వాత పార్టీ రిజిస్ట్రేషన్‌ పూర్తయితే ఆమె రాజకీయ కార్యకలాపాలు మరింత వేగవంతం అవుతాయి.

తెలంగాణలో పార్టీల మధ్య పోటీని, వారసత్వ పోరాటాన్ని తీవ్రతరం చేస్తోంది. ఈ వివరాలు ఎన్నికల సంఘం చర్యలు, పార్టీల అభ్యంతరాలు సంక్లిష్టంగా మార్చాయి. పక్షం రోజుల్లో కవిత ఏం చేస్తుంది అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular