Jubilee Hills Pub Case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అమ్నేసియా పబ్ కేసులో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ముస్లిం వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకుని మైనర్ గా ప్రకటిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే గత నెల జువైనల్ కోర్టు నిందితుడిని మేజర్ గా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది.. అయితే దీనిని సవాల్ చేస్తూ ఒక బోర్డు చైర్మన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మంగళవారం హైకోర్టులో భోజన విరామ సమయంలో వాదనలు జరిగాయి. వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకుని మైనర్ గా పరిగణిస్తూ ఫోక్సో చట్టం కింద విచారణ చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.
జూబ్లీహిల్స్ అమ్నేసియా పబ్ కేసులో వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు నిందితుడుగా ఉన్నాడు.. అతడికి పోటెన్సీ టెస్ట్ చేసి, మేజర్ గా ప్రకటించాలని జువేనైల్ కోర్టును పోలీసులు అప్పట్లో కోరారు. పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు.. నిందితుడిని మేజర్ గా ప్రకటించింది.. అయితే కోర్టు తీర్పును సవాల్ చేస్తూ వక్ఫ్ బోర్డు చైర్మన్ హైకోర్టును ఆశ్రయించారు.. అయితే విచారణ జరిపిన హైకోర్టు నిందితుడిని మైనర్ అని ప్రకటించింది. జువైనల్ కోర్టు తీర్పును తప్పు పట్టింది.
2022 మే 28న స్నేహితులకు కలిసి ఫ్రెషర్స్ పార్టీకి వెళ్లిన బాలికపై సామూహిక అత్యాచారం జరగటం, ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రసారం కావడం సంచలనం తెపింది. పైగా ఈ విషయాన్ని బాలిక స్వతహాగా మీడియాకు చెప్పడం కలకలం రేపింది. అయితే బాలిక చెప్పిన ఆధారాల ప్రకారం పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు. ఈ కేసులో నిందితులను మేజర్లుగా పరిగణించాలని దిసులు అప్పట్లో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
అంతేకాదు అప్పట్లో ఈ నిందితులకి పోలీసులు ప్రత్యేకంగా బిర్యానీ ప్యాకెట్లు తప్పించడం కలకలం రేపింది. దీనిపై ప్రతిపక్షాలు ఆందోళనలు చేయడంతో ప్రభుత్వం ఆత్మ రక్షణలో పడింది. బిర్యానీ ప్యాకెట్లు అందించిన పోలీసులపై చర్యలు తీసుకుంది. అయితే ఈ నిందితులను మేజర్ గా ప్రకటించాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా జువైనల్ కోర్టు విచారణ జరిపింది.. వారిని మేజర్లు గా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే ఆ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ వక్ఫ్ బోర్డు చైర్మన్ హై కోర్టును ఆశ్రయించగా.. కోర్టు మంగళవారం నిందితులు మైనర్లని తీర్పు చెప్పింది.