NTR- Koratala Shiva: #RRR చిత్రం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈమధ్యనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది, ఇందులో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ బడా హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.
ఈమధ్యనే ఈయన షూటింగ్ లో కూడా పాల్గొన్నాడు, దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి కూడా. సముద్రం బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ చిత్రాన్ని కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్నాడట. హాలీవుడ్ కి చెందిన ప్రముఖ టెక్నిషియన్స్ కూడా ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. అయితే ఈ సినిమా కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో లీక్ అయ్యి అభిమానులను కంగారు పెడుతుంది.
అదేమిటి అంటే ఇందులో విలన్ సైఫ్ అలీ ఖాన్ చాలా పవర్ ఫుల్ గా మరియు క్రూరంగా కనిపించబోతున్నాడట. ఇందులో ఆయన తన గ్యాంగ్ తో కలిసి ఒక కొండప్రాంతం లో నివసిస్తూ అమాయక ప్రజలను చిత్రహింసలకు గురి చేస్తాడట. అయితే అక్కడికి వచ్చిన హీరో విలన్ ఆగడాలను అరికట్టి, అమాయక ప్రజలను ఎలా కాపాడాడు అనేదే స్టోరీ. మన చిన్నతనం నుండి ఇలాంటి కథలను వింటూనే ఉన్నాము, చూస్తూనే ఉన్నాము.
మళ్ళీ అలాంటి రొటీన్ సబ్జెక్టు ని కొరటాల శివ ఈ సినిమా కోసం ఎంచుకున్నాడు. ఎక్కడ మళ్ళీ ఆయన ఆచార్య లాంటి సినిమా ని తీసి మా మీదకి వదులుతాడో అని భయపడిపోతున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే కొరటాల సినిమాలు ఇప్పటి వరకు కేవలం కంటెంట్ ని ప్రధానంగా నమ్ముకొని నడుస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ కంటెంట్ రొటీన్, టేకింగ్ చాలా కొత్తగా ఉండాలి, ఆయన అలా ఫ్రెష్ గా ఇప్పుడు ఉన్న ఫామ్ లో తియ్యగలరా లేదా అనే సందేహం లో ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.