Densuke Watermelon: పుచ్చకాయ ధర మామూలుగా అయితే ఓ రూ. 20 లేదా 30 ఉంటుంది. కానీ ఇక్కడ కాసిన పుచ్చకాయకు రూ. 5 లక్షలు ఉంటుంది. నిజంగా మీరు విన్నది నిజమే. కాయకు రూ. ఐదు లక్షలు అయితే పండించే వాడికి అన్ని డబ్బులే అనుకుంటాం. కానీ అవి కూడా ఎక్కువగా కాయవు. పరిమితంగానే కాస్తాయి. కానీ ఇది ఇక్కడ కాదు. జపాన్ లో. పుచ్చకాయకు అంతటి డిమాండ్ ఉండటంతో దాన్ని అరుదుగానే కొనుగోలు చేస్తారు. మామూలు జనం అయితే కొనలేరు. కానీ బాగా డబ్బున్న వారు మాత్రమే వీటిని కొంటారు.
జపాన్ లోని హోక్కాయిడో ప్రాంతంలో మాత్రమే దీన్ని పండిస్తారు. పుచ్చకాయల్లో అత్యంత ఖరీదైనదిగా దీనికి పేరుంది. డెన్సుకే అని దీన్ని పిలుస్తారు. డెన్సు అంటే విజయం అని సుకే అంటే ఎలక్ర్టికల్ అని అర్థం. దీని కోసం అత్యాధునిక వ్యవసాయ పద్ధతులు వాడుతున్నారు. ఏడాదికేడాది వీటి ధర పెరుగుతూనే ఉంది. వీటిని తినడానికి కాకుండా బహుమతిగా కూడా ఇస్తారట.
ఇది 6 నుంచి 7 కిలోల బరువు ఉంటుంది. పైన లోపల ముదురు రంగులోనే ఉంటుంది. దీని విత్తులు చిన్నగా ఉండటం వల్ల వాటితో పాటే తినేయొచ్చు. తింటుంటే కరకరలాడుతూ ఉంటుందట. అందుకే దీనికి అంత ధర అంటున్నారు. అక్కడి వాతావరణం అనుకూలంగా ఉండటంతో అక్కడివారు సాగు చేస్తున్నారు. ఇది అన్ని ప్రాంతాల్లో పండదు. అందుకే అంత డిమాండ్ ఉందని చెబుతున్నారు.
దీని విత్తనాలు కూడా ఖరీదైనవే. ఒక్కో విత్తు ధర రూ. 50 పడుతుంది. ఒక్కో ప్యాకెట్ ధర రూ. 2500 ఉంటుంది. మన దేశంలో అయితే మొత్తం పుచ్చకాయ దుకాణమే వచ్చేస్తుంది. ఇంతటి డిమాండ్ ఉన్నందునే ఇది అరుదుగా పండుతుంది. అరుదుగానే అమ్ముతుంది. తక్కువ నాణ్యత కలిగినవి రూ.25000 వరకు ఉంటుంది. మొత్తానికి ఖరీదైన పుచ్చకాయ సొంతం చేసుకోవాలంటే మన చేతి చమురు వదలాల్సిందే.