HomeతెలంగాణKCR And KTR: తండ్రీ కొడుకులను బయటకు లాగిన రేవంత్‌.. జన్వాడ రేవ్‌ పార్టీ.. తనిఖీలపై...

KCR And KTR: తండ్రీ కొడుకులను బయటకు లాగిన రేవంత్‌.. జన్వాడ రేవ్‌ పార్టీ.. తనిఖీలపై స్పందించిన కేసీఆర్, కేటీఆర్‌!

KCR And KTR: తెలంగాణలో దీపావళికి ముందే పొలిటికల్‌ బాంబులు పేలుతాయని ఇటీవల సియోల్‌ పర్యటనలో ఉన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అవి చర్చనీయాంశమయ్యాయి. అందరూ కాళేశ్వరం, ఫోన్‌ ట్యాపింగ్, ధరణి అక్రమాలకు సంబంధించి అరెస్టలు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ రేవంత్‌ వేసిన స్కెచ్‌ మామూలుగా లేదు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ లక్ష్యంగా వేసిన ఎత్తుగడ ఫలించింది. జన్వాడలోని కేటీఆర్‌ బావమరిది ఫాంహౌస్‌లో శనివారం రాత్రి పార్టీ జరిగింది. డీజే సౌండ్‌కు చుట్టపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఫాంహౌస్ వద్దకు వెళ్లి తనిఖీలు చేయగా, ఏడు లీటర్ల విదేశీ మద్యంతోపాటు క్యాసినో పరికరాలు, ప్లేయింగ్‌ కార్డ్స్‌తోపాటు డ్రగ్స్‌ కూడా దొరికినట్లు వార్తలు వచ్చాయి. ఈ తనిఖీల్లో 41 మందిని పోలీసులు పట్టుకున్నారు. కౌన్సెలింగ్‌ తర్వాత విడుదల చేశారు. ఇక ఈ పార్టీ కేటీఆర్‌ బావమరిది ఫాంహౌస్‌లో జరగడం సంచలనంగా మారింది. తాము డ్రగ్స్‌ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టామని పదే పదే చెప్పే కేటీఆర్‌ బావ మరిది ఇంట్లో రేవ్‌ పార్టీ నిర్వహించడం సంచలనం రేపింది.

ఇళ్లలో తనిఖీలు..
ఫామ్‌హౌస్‌లో విదేశీ మద్యం దొరకడంతోపాటు కొకైన్, డ్రగ్స్‌ తీసుకున్నట్లు అనుమానించారు. దీంతో మరింతగా విచారణ చేసేందుకు ఫామ్‌హౌస్‌ యజమాని, కేటీఆర్‌ బావమరిది రాజ్‌పాకాలను విచారణకు పిలిశారు. అయితే రేవ్‌ పార్టీ భగ్నం తర్వాత రాజ్‌ పాకాలా పారిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. ఆయన తమ అదుపులో లేడని క్లారిటీ ఆచ్చారు. ఇక రాజ్‌ పాకాలతోపాటు ఆయన సోదరుడు శైలేంద్ర పాకాల ఇళ్లలో ఎక్సైజ్‌ అధికారులు సోదాలు చేశారు. దీనిపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర స్పందించారు. ఆయన డీజీపీకి ఫోన్‌ చేసి సోదాలు ఆపాలని కోరారు.

30 ఎకరాల్లో ఫామ్‌హౌస్‌..
ఇదిలాఉంటే జన్వాడలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బావ మరిది రాజ్‌పాల్‌కు 30 ఎకరాల్లో ఫామ్‌హౌస్‌ ఉంది. ఇందులోకి వెళ్లడం కూడా అంత ఈజీ కాదు. మూడు గేట్లు దాటుకుని వెళ్లాలి. ఈ ఫామ్‌హౌస్‌లో అక్రమ దందాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వారంతాల్లో పార్టీలు నిర్వహిస్తారని తెలిసింది. ఇక తాజా దాడిలో 21 మంది పురుషులు, 14 మంది మహిళలు పట్టుపడ్డారు. 35 మందితో మద్యం పార్టీ నిర్వహించినట్లు తెలిపారు. దాడి సమయంలోనే కొందరికి డ్రగ్ పరీక్షలు చేసిన ఒకరికి పాజిటివ్‌గా తేర్చారు. దీంతో విజయ్‌ మద్దూరిని ఎన్డీపీఎస్‌ కేసులో ఇరికించారు.

స్పందించిన కేటీఆర్‌..
ఇదిలా ఉంటే.. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలతో బిజీగా గడిపిన కేటీఆర్‌ ఆదివారం సాయంత్రం ఈ ఘటనపై స్పందించారు. బీఆర్‌ఎస్‌ను, తనను రాజకీయంగా ఎదుర్కొనలేక ఇలా చీఫ్‌గా వ్యవహరించారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ఇలా డ్రగ్స్‌ దాడి పేరుతో కలకల రేపడంతో గులాబీ నేతల్లో టెన్షన్‌ మొదలైంది. బీఆర్‌ఎస్‌ మానసిక స్థైర్యాన్నిదెబ్బ తయాలని అనుకున్నాడు. జన్వాడలో ఉన్నది తన ఫామ్‌హౌస్‌ కాదని కేటీఆర్‌ తెలిపారు. తన బావమరిది సొంత ఇంట్లో గ్రృహప్రవేశం చేసిన సందర్భంగా పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీనినే మీడియా రేవ్‌ పార్టీ, అని చిల్లర చేస్తోందని మండిపడ్డారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version