Anasuya Bharadwaj: పుష్ప 2పై ఇండియా వైడ్ హైప్ నెలకొంది. అందుకు ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ నిదర్శనం. విడుదలకు ముందే నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది. పుష్ప 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్.. మొత్తం కలుపుకొని రూ. 1000 కోట్ల బిజినెస్ చేసింది. పుష్ప 2 బడ్జెట్ రూ. 350 కోట్లకు లోపే. ఈ లెక్కన నిర్మాతలు ఏ స్థాయిలో ఆర్జిస్తున్నారో అంచనా వేయవచ్చు. తెలుగుతో పాటు మలయాళ, హిందీ భాషల్లో పుష్ప 2 పై అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 5న రికార్డు స్థాయిలో వేల థియేటర్స్ లో పుష్ప 2 విడుదల కానుంది.
పుష్ప చిత్రంలో దాక్షాయణి రోల్ చేసిన అనసూయ లేటెస్ట్ కామెంట్స్ మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. పుష్ప 2లో సైతం నటిస్తున్న అనసూయ తన మొదటి రివ్యూ ఇచ్చేసింది. అనసూయ మాట్లాడుతూ.. పుష్ప మూవీ కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే. అసలు కథ రెండవ భాగంలో ఉంది. పుష్ప 2లో ప్రతి 10 నిమిషాలకు ఒక ట్విస్ట్, హైప్ ఇచ్చే సన్నివేశం ఉంటుంది. ప్రతి 10 నిమిషాలకు మీరు ఒక క్లైమాక్స్ చూస్తారు. పుష్ప 2 మీ అంచనాలకు మించి ఉంటుందని అన్నారు.
అనసూయ మాటలు వింటుంటే పుష్ప 2 ఓ రేంజ్ లో ఉంటుందని అర్థం అవుతుంది. పుష్పలో సునీల్ మంగళం శీను అనే ఎర్ర చందనం స్మగ్లింగ్ సిండికేట్ కింగ్ రోల్ చేశాడు. మంగళం శ్రీను భార్య అయిన దాక్షాయణిగా అనసూయ నటించింది. ఇది పూర్తిగా నెగిటివ్ రోల్ కావడం విశేషం. పుష్ప 2లో అనసూయ రోల్ మరింత కీలకంగా ఉండే అవకాశం కలదు.
ఇటీవల దేవిశ్రీ ప్రసాద్ సైతం ఇదే తరహా కామెంట్ చేశాడు. సుకుమార్ పుష్ప 2 కథ చెబుతుంటే మూడు సార్లు ఇది క్లైమాక్సా… ఇది క్లైమాక్సా అని మూడు సార్లు అడిగాను. పుష్ప 2 మామూలుగా ఉండదు అన్నారు. పుష్ప 2 చిత్రానికి దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ కూలీగా మొదలైన పుష్పరాజ్ ప్రస్థానం సిండికేట్ శాసించే స్థాయికి చేరుకుంటుంది. పీఠం మీద కూర్చున్నాక పుష్పరాజ్ కి ఎదురైన సవాళ్లు ఏమిటో పుష్ప 2లో చూడొచ్చు.
ప్రధాన విలన్ రోల్ ఫహద్ ఫాజిల్ చేస్తున్నారు. పుష్పరాజ్-షెకావత్ మధ్య సంఘర్షణే పుష్ప 2. రష్మిక మందాన మరోసారి అల్లు అర్జున్ తో జతకడుతుంది. విడుదలైన సాంగ్స్ ఆకట్టుకున్నాయి.