https://oktelugu.com/

భూ వివాదంలో జనగామ ఎమ్మెల్యే: ప్రతిపక్షాల ఆందోళన ఉద్రిక్తం

సిద్ధిపేట జిల్లా చేర్యాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి చెరువు ఆక్రమించాడాని ఆరోపిస్తూ బీజేపీ, వామపక్ష నాయకులు శుక్రవారం బంద్ కు పిలుపునిచ్చాయి. అలాగే ర్యాలీగా వచ్చిన వీరికి స్థానిక టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల తోపులాటతో ఉద్రిక్తంగా మారింది. చెరువు మత్తడి ప్రవాహ పరిధిలో నిర్మించిన ప్రహారిని కూల్చేశారు. అలాగే ప్రహారీ స్థల యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు 33 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. Also Read: టీపీసీసీపై […]

Written By:
  • NARESH
  • , Updated On : December 12, 2020 / 04:21 PM IST
    Follow us on

    సిద్ధిపేట జిల్లా చేర్యాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి చెరువు ఆక్రమించాడాని ఆరోపిస్తూ బీజేపీ, వామపక్ష నాయకులు శుక్రవారం బంద్ కు పిలుపునిచ్చాయి. అలాగే ర్యాలీగా వచ్చిన వీరికి స్థానిక టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల తోపులాటతో ఉద్రిక్తంగా మారింది. చెరువు మత్తడి ప్రవాహ పరిధిలో నిర్మించిన ప్రహారిని కూల్చేశారు. అలాగే ప్రహారీ స్థల యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు 33 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

    Also Read: టీపీసీసీపై లీకులు.. కుట్ర కోణం ఉందంటున్న సీనియర్లు..!

    సిద్ధిపేట జిల్లా చేర్యాల మునిసిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు మత్తడి ప్రాంగణంలోని సర్వే నంబర్ 1402లో 20 గుంటల భూమి ఉంది. చాలా కాలంగా ఖాళీగా ఉండడంతో అక్కడ పశువుల సంతను నిర్వహించారు. కొందరు చిరు వ్యాపారులు దుకాణాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే 2103లో ఈ భూమిని పట్టాదారులైన అజీజ్ అహ్మద్ నూర్ కుటుంబం వసీమ్ ఖాన్, క్రుష్ణారెడ్డికి విక్రయించింది. వెంటనే ఆ స్థలం చుట్టూ ప్రహారిని నిర్మించారు.

    అయితే ఈ భూమిని గత జనవరిలో ముత్తరెడ్డి కూతరు తుల్జా భవానిరెడ్డి,ఎమ్మెల్యే బంధువులైన మారుతీప్రసాద్, జితేందర్ రెడ్డి కొన్నారు. ఇటీవల తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి గోదావరి నీటిని విడుదల చేయడంతో రెండు మూడు రోజుల పాటు అలుగు పోసింది. ఆ వరదంతా ప్రధాన రహదారిపై ప్రవహించింది. పెద్ద చెరువు నుంచి అలుగుపోసే ఈ నీటినంతదా కాలువ ద్వరా సమీపంలో ఉన్న కుడి చెరువుకు తరలించాలని నిర్ణయించారు.

    Also Read: కేసీఆర్ కారు.. బోరు? రిపేరు?

    అయితే చెరువు నుంచి నేరుగా కాలువ తీస్తే తన కూరుతు కొనుగోలు చేసిన స్థంల కోల్పోవాల్సి వస్తుందని, కాస్త పక్కకు జరిపి డిజైన్ చేయించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతో చెరువును ఆనుకొని కాకుండా ముత్తిరెడ్డి ఆక్రమించిన 20 గుంటల స్థలం మధ్యనుంచి కాలువ నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రతిపక్షాలు చేసిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్