కరోనా ప్రభావం ప్రతీ మనిషిపై పడింది. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు. ప్రభుత్వాల పరిస్థితీ ఇలాగే ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం భూములు అమ్మకానికి పెట్టింది. దీంతో కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం తాజాగా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వ తరపున వాదించిన న్యాయవాది.. సంక్షేమ పథకాల అమలుకు నిధులు సరిపోవట్లేదని కోర్టుకు విన్నవించారట. దీనిపై కోర్టు ఘాటుగా స్పందించినట్టు సమాచారం.
Also Read: ఈ విధ్వంసం వెనుక ఆయనున్నారు: డీజీపీకి బాబు లేఖ
మాకు తెలుసు…
ప్రభుత్వం ‘ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో మాకు తెలుసు..’ అని కోర్టు నర్మగర్భంగా వ్యాఖ్యానించిందట. అలాగే కరోనా సమయంలో మద్యం రేటును ప్రభుత్వం పెంచినా దాన్ని కొని ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చిన తాగుబోతులను కరోనా వారియర్లు అని వ్యంగ్యంగా అభివర్ణించారట న్యాయమూర్తులు. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 17న జరగనుందని సమాచారం. మరి, ఈ భూముల అమ్మకంపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది? అనుమతిస్తుందా? లేదా? అన్నది చూడాలి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్