Homeతెలంగాణహుజూరాబాద్ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఈటల మాటలు.. మంత్రి హరీశ్ రావు

హుజూరాబాద్ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఈటల మాటలు.. మంత్రి హరీశ్ రావు

హుజూరాబాద్ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఈటల మాటలు ఉన్నాయని మంత్రి హరీశ్ రావు అన్నారు.  ఉపఎన్నిక విషయంలో ఆలోచన చేయండి. రాజేందర్ గారికి టీఆర్ఎస్ పార్టీ ఏం అన్యాయం చేయలేదు. అన్ని విషయాల్లో అండగా నిలబడింది. సీఎంగారు రాజేందర్ ను దగ్గరకు తీసుకుని ఆయనకు అవకాశాలు ఇచ్చి అంచెలంచెలుగా ఇంత స్థాయికి తెచ్చింది. కేసీఆర్. దామోదర్ రెడ్డి మీద పోటీ చేసే సమయానికి రాజేందర్ ప్రజా ప్రతినిధి కూడా కాదు. సామాజిక సేవలో పాల్గొన్న వ్యక్తి కాదు. కాని అవకాశాలు ఇచ్చి అయన్ను నిలబెట్టారు. ఇక్కడ అప్పటికే తెరాస బలమైన పార్టీగా ఉంది. ఆయనకు అవకాశం ఇచ్చి ఆయన స్థాయిని నిలబెట్టింది కేసీఆర్ గారు అని తెలిపారు.

రైతు బంధు పథకం ప్రారంభించే ముందు సీఎం శాలపల్లిని ఎన్నుకుని ఎన్నికలు లేకుండానే ఇక్కడ ప్రారంబించారు. ఏ ఓట్లు ఉన్నాయని ఇక్కడ సీఎం గారు ఆనాడు ప్రారంభించారు. ఆ సభలో సీఎం గారు రాజేందర్ నాకు తమ్ముడు, నా కుడి భుజం అని ఆకాశానికి ఎత్తుకుని గొప్పగా సీఎం చెప్పారు. అలాంటి రాజేందర్ సీఎం గారి కోసం ఏం మాట్లాడుతున్నారు. కేసీఆర్ నీకు గోరి కడతా అన్నాడు. నిన్ను ఈ స్థాయికి తెచ్చిన వ్యక్తిపై ఇంతటి మాట మాట్లాడతే ఇంక నీపై విశ్వాసం ఎలా ఉంటుంది. రాజేందర్ మాట్లాడే భాష, వ్యవహర శైలి సభ్య సమాజం ఒప్పుకుంటుందా… నన్ను పట్టుకుని కూడా గాడు…గీడు అని మాట్లాడుతున్నరు. నేను మాత్రం రాజేందర్ గారు అనే అంటా.. ఢిల్లీ నుండి, కేరళ నుండి కేంద్ర మంత్రులు వచ్చి మాట్లాడతరు. తప్పులేందట, నేను మాట్లాడితె తప్పా. ప్రజల సమస్యల కోసం మాట్లాడే బాధ్యత మాపై పెట్టారని అన్నారు.

మేం మాట్లాడితే తప్పు అంటే ఎలా.. రాజేందర్ మాటలు మాట్లాడే మాటలు హుజూరాబాద్ కు నష్టం చేసేలా, ఈ ప్రాంత ప్రజల గౌరవాన్ని, మనోభావాలన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. మీ అందరి ఆశీస్తులతో ఖచ్చితంగా గెలిచేది టీఆర్ఎస్ పార్టీనే. ప్రభుత్వంగా మేం పని చేస్తుంటే..తన నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకుంటున్నారు ఈటల రాజేందర్ ఐదే ళ్ల క్రితం నాలుగు వేల ఇళ్లు కట్టించమని ప్రభుత్వం మంజూరు చేసింది. బాన్సువాడలో పోచారం గారు ఐదు వేల ఇళ్లు కట్టించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ నాలుగు వేల ఇళ్లు కట్టించారు. ఒక్క ఇళ్లు కట్టించని మంత్రి ఈటల రాజేందర్ సిద్దిపేటలో 2400 ఇళ్లు కట్టి పూర్తి చేశాం. దాదాపు వంద నుండి 150 మంది వైశ్యులుకు అవకాశం ఇచ్చాం. ఇవాళ మంత్రిగా చేయలేని వారు… రేపు ప్రతిపక్షఎమ్మెల్యేగా ఇళ్లు కడతారా.. మిమ్ముల్ని అవమాన పరిచేలా ఈటల మాట్లాడారని మీ సామాజిక వర్గానికి భవనం అడిగితే మిమ్ముల్ని అవమానపర్చేలా మాట్లాడారని మీరే చెప్పారు. ఓసీల్లో అట్టడుగు పేద వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ ఎలాంటి నిబంధనలు లేకుండా, సులభతరంగా ఈ సౌకర్యం కల్పించామని తెలిపారు.

ఓసీల్లో ఉండే పేదలకు ఏ ప్రభుత్వం చేయని పని మేం చేసాం. పేదరికానికి కులం, మతం అడ్డం ఉండవద్దని ప్రతీ పేదింటి ఆడపిల్లకు లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి,కేసీఆర్ కిట్, ఆసరా పెన్షన్ వంటివి ఇస్తున్నాం. వైశ్య కార్పోరేషన్ ఇంతకు ముందు ఇచ్చిన హమీ, దానికి కట్టుబడి ఉన్నాం. కరోనా వల్ల కొంత ఆలస్యం అయింది. ఆ ఫలితం కూడా మీకు దక్కుతుంది. వైశ్యులకు ప్రభుత్వంలో మంచి స్థానం దొరికింది. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, కార్పోరేషన్లు చైర్మన్లుగా అవకాశాలు కల్పించింది ప్రభుత్వం. మున్సిపల్ ఛైర్మన్లుగా, మేయర్లుగా అవకాశాలు టీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిందని తెలిపారు.

 

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular