ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పలు పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జనసేన, వైసీపీ పార్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రముఖ కథానాయకుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలతో పెద్ద దుమారం రేగుతోంది. వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లింది వ్యవహారం. ఈ నేపథ్యంలో మరో సినీనటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ను చెప్పుతో కొడతానని అవాకులు చెవాకులు పేలుతున్నాడు. దీంతో పవన్ అభిమానుల్లో సైతం ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో పోసాని ఇంటిపై రాళ్ల దాడి జరిగింది.
పోసాని కామెంట్లతో రెచ్చిపోయిన పవన్ కల్యాణ్ అభిమానులు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆయనను ఇంటి వద్ద జాగ్రత్తగా దింపారు. పోసాని కృష్ణమురళి ఇంటిపై రాళ్లదాడి జరిగిన నేపథ్యంలో ఆయన ఓ మీడియాకు ఫోన్ ఇన్ ఇచ్చారు దీంతో పోసాని పవన్ పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ విషయంలో పవన్ సోదరుడు చిరంజీవి స్పందించకపోవడంపై కూడా విమర్శలు చేశారు. ప్రజారాజ్యం పార్టీ సమయంలో చిరంజీవిపై ఆరోపణలు చేస్తే తాను ఖండించానని ఇప్పుడు ఆయన పవన్ వ్యాఖ్యలను ఖండిస్తే ఏం పోతుందని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ఎవరినైనా తిట్టొచ్చు కానీ ఆయనను ఎవరు తిట్టకూడదా అని అడిగారు. తాను 35 ఏళ్లుగా పరిశ్రమలో ఉన్నానని చెప్పుకొచ్చారు. రిపబ్లిక్ ఫంక్షన్ సమయంలో రేగిన దుమారం ఆగడం లేదు.
పవన్ కల్యాణ్ అభిమానులతో తనకు ప్రాణభయం ఉందని అన్నారు. తనను చంపేందుకు కూడా వారు వెనకాడరని భావోద్వేగంతో చెప్పారు. తనకు ప్రాణభయం లేదని అన్నారు. ఎవరికి భయపడకుండా న్యాయం కోసం పోరాటం చేస్తున్నానని పేర్కొన్నారు. దీనిపై ఎంతదాకా కూడా వెళ్లడానికైనా సిద్ధమేనని ప్రకటించారు.
