HomeతెలంగాణTG Congress: ‘సోషల్’ స్ట్రైక్.. పోస్టులు ఊస్ట్..టీపీసీసీలో కీలక పరిణామాలకు కారణం అదే!

TG Congress: ‘సోషల్’ స్ట్రైక్.. పోస్టులు ఊస్ట్..టీపీసీసీలో కీలక పరిణామాలకు కారణం అదే!

TG Congress: తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2014, 2018 సంవత్సరాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సరైన అస్త్రాలను ఉపయోగించుకోలేదు. అంతర్గతంగా కుమ్ములాటలు కూడా ఆ పార్టీకి చాలా ఇబ్బంది కలిగించాయి. వ్యూహం లేని ఎత్తులు.. అర్థంలేని పొత్తులతో ఆ పార్టీ అధికారానికి దూరమైంది. 2023 సంవత్సరానికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చేసింది. ఆ ఉత్సాహం పేరు రేవంత్ రెడ్డి.. బలమైన సోషల్ మీడియా లేకపోయినప్పటికీ చాలామంది రేవంత్ రెడ్డి దూకుడు తనం చూసి సొంతంగా పనిచేయడం మొదలుపెట్టారు. అక్కడ కాంగ్రెస్ పార్టీని చూడకుండా కేసీఆర్ మీద వ్యతిరేకతను విపరీతంగా ప్రచారం చేశారు. దీనికి భారత రాష్ట్ర సమితి నాయకుల వ్యవహార శైలి కూడా తోడు కావడంతో ఒక్కసారిగా వ్యతిరేకత తారస్థాయికి చేరింది. అప్పటికి భారత రాష్ట్ర సమితి మేల్కొని చేయాల్సిన ప్రయత్నాలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. చివరికి కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కింది. రేవంత్ రెడ్డి చిరకాల వాంఛ ఆయన ముఖ్యమంత్రి ఆస్థానం ఆయనకు లభించింది. అయితే ఇలా దక్కిన అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ.. ఆ పార్టీ శ్రేణులు సరైన విధానంలో ఉపయోగించుకోవడంలేదనే ఆరోపణ వినిపిస్తున్నాయి. అధికారం దక్కిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యవహార శైలి మారిందని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూపించిన చొరవను ఇప్పుడు ప్రదర్శించడం లేదని సాక్షాత్తు ఆ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.. సోషల్ మీడియా వారియర్స్ గా పని చేసిన వారు కూడా గుర్తింపు లభించకపోవడంతో గాంధీభవన్ కు దూరమవుతున్నారు.

సోషల్ స్ట్రైక్ పడిందా

అధికారం కోల్పోయిన తర్వాత భారత రాష్ట్ర సమితి తన సోషల్ మీడియా విభాగాన్ని మరింత బలోపేతం చేసింది. తాము మెడికల్ కాలేజీలు కట్టి తప్పు చేశామని.. ఆ స్థానంలో 30 యూట్యూబ్ చానల్స్ పెట్టుకుంటే కచ్చితంగా అధికారంలోకి వచ్చే వారమని కేటీఆర్ ఆ మధ్య అన్నారు. ఆయన అన్నట్టుగానే సోషల్ మీడియాను మరింత బలోపేతం చేస్తూనే.. లెక్కకు మిక్కిలి యూట్యూబ్ ఛానల్స్ ను నడిపిస్తున్నారు. ఇక ట్విట్టర్ హ్యాండిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణలో చీమ చిటుక్కుమన్నా వెంటనే భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా విభాగానికి తెలిసిపోతుంది. చివరికి అధికారిక కార్యక్రమాలు.. అధికారిక నిర్ణయాలు.. అందులో చోటుచేసుకుంటున్న వివాదాలు కూడా చేరిపోతున్నాయి. దీంతో భారత రాష్ట్ర సమితి అప్పర్హ్యాండ్ అవుతోంది. ప్రభుత్వం పరంగా తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఆ పార్టీ వ్యతిరేక కోణంలో ప్రజల్లో ప్రొజెక్టు చేయగలుగుతుంది. దీనిని నిలువరించడంలో కాంగ్రెస్ పార్టీ, దాని సోషల్ మీడియా విభాగం అట్టర్ ఫ్లాఫ్ అవుతోంది.. ఇటీవల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ట్విట్టర్లో ఒక పోల్ పెట్టింది. ప్రజా పరిపాలన బాగుందా? ఫామ్హౌస్ పరిపాలన బాగుందా? అని రెండు ప్రశ్నలు సంధించింది. ఆ పోల్ నిర్వహించిన వారు దాన్ని కనీసం చూసుకోకుండా వదిలేశారు. దీంతో బ్యాట్ లతో భారత రాష్ట్ర సమితి రెచ్చిపోయింది. ఫామ్ హౌస్ పరిపాలన బాగుందనే పోల్ కు భారీగా ఓట్లు వేయించింది. ఇది కాస్త భారత రాష్ట్ర సమితికి లాభంగా.. కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన నష్టంగా పరిణమించింది. దీంతో సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏర్పడింది.. ఈ పోల్ ను ఉద్దేశించి కెసిఆర్ కూడా వ్యాఖ్యలు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. అయితే ఈ వ్యవహారానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం అధిపతిని తొలగించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఇదే ప్రచారం జరుగుతుంది.. ఒకవేళ గనుక టీపీసీసీ సోషల్ మీడియా విభాగ అధిపతిని ఆ పోస్టు నుంచి తొలగిస్తే.. కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టు అవుతుంది.. అప్పుడు భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా విభాగానిది అప్పర్హ్యాండ్ అవుతుంది. ఒకవేళ తొలగింపుల లాంటివి లేకుండా చేస్తే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం మరిన్ని విమర్శలు ఎదుర్కొంటుంది. ఇలా ఎటు చూసుకున్నా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందే ఉన్నది..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular