The Recruit Season 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మన తెలుగు సినిమాలే కాకుండా హాలీవుడ్ సినిమాలను కొరియన్ సినిమాలను కూడా ప్రేక్షకులు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సౌత్ కొరియా నుంచి ఎక్కువగా సిరీస్ లు వస్తు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాయి. ఇక 2022 లో వచ్చిన ‘ది రిక్రూట్ ‘ (The Recruit) సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సస్పెన్స్ గొలిపే సన్నివేశాలతో యాక్షన్ ఎపిసోడ్స్ ని కూడా చాలా చక్కగా చిత్రీకరించిన ఈ సిరీస్ ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరికి ఫేవరెట్ గా మారిపోయింది. ఇక 2022లో వచ్చిన మొదటి సీజన్ కి కొనసాగింపుగా 2025 జనవరి 30 వ తేదీన ‘ది రిక్రూట్ సీజన్ 2’ (The Recruit Season 2) నెట్ ఫిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఇప్పటికే దీనికి చాలా మంచి గుర్తింపైతే వచ్చింది. ఈ సీజన్ 2 ని చూసిన ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో సీజన్ 3 ఎప్పుడు వస్తుంది అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది… ఇక సీజన్ 2 కు మంచి గుర్తింపు రావడంతో సీజన్ 3 మీద ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగి దాని కోసం ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక సీజన్ 2 ఎండింగ్ లో ఇచ్చిన ఒక ట్విస్ట్ తో సీజన్ 3 మీద ప్రతి ప్రేక్షకుడికి ఆసక్తి అయితే పెరిగింది. మరి సీజన్ 1 కి 2 కి మధ్య మూడు సంవత్సరాల గ్యాప్ అయితే ఉంది.
ఇక ఆ విధంగానే సీజన్ 3 కి కూడా మరో రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. అంటే 2026 ఎండింగ్ లో కానీ 2027 వ సంవత్సరంలో కానీ ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఏది ఏమైనా కూడా ది రిక్రూట్ సిరీస్ అనేది యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులను అలాగే ఇండియన్ సినిమా అభిమానులను మెప్పించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…
మరి ఇలాంటి సందర్భంలోనే సీజన్ 2 ఇచ్చిన కిక్కు అంతా ఇంతా కాదు. పది ఎపిసోడ్లతో వచ్చిన ఈ సీజన్ 2 ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా ఒక వరంలా మారింది. ఈ సిరీస్ ని చూడడానికి ప్రతి ప్రేక్షకుడు సైతం ఆసక్తి చూపిస్తూ ఉండటం విశేషం…కొరియన్ సినిమాలు,సిరీస్ లు హాలీవుడ్ తో పోటీ పడుతూ ఉంటాయి. ఇప్పుడు వచ్చిన ఈ సిరీస్ కూడా హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా చాలా చక్కటి కాన్సెప్ట్ తో తెరకెక్కించారు.
ముఖ్యంగా సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకు క్యూరియాసిటి తో ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో దర్శకుడు చాలా వరకు సక్సెస్ అయ్యాడు. అందువల్లే సీజన్ 3 మీద ఇప్పుడు అందరిలో ఆసక్తి అయితే పెరుగుతుంది. మరి సీజన్ 3 ఎప్పుడు వచ్చినా కూడా దానికి భారీ ఆదరణ అయితే దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇక సీజన్ 3 ని కూడా నెట్ ఫ్లిక్స్ వారే రిలీజ్ చేయడానికి అగ్రిమెంట్ ను కుదుర్చుకున్నట్టుగా తెలుస్తోంది…