Akash Bobba: అమెరికా సంపద వృథాగా ఖర్చు చేస్తున్నామని భావించిన అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిని నియంత్రణతోపాటు ప్రభుత్వానికి ఆర్థికపరమైన సలహాలు, సూచనలు చేసేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(డోజ్) ఏర్పాటు చేశారు. ఈ శాఖకు కో చైర్మన్లుగా ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిని నియమించారు. అయితే వివేక్ రామస్వామి బాధ్యతలు చేపట్టకుండానే వైదొలిగారు. ఇప్పుడు మస్క్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ విభాగంలోకి ఆరుగురు యువ ఇంజినీర్లును తీసుకున్నారు. ఇందులో భారత సంతతికి చెందిన ఆకాశ్ బొబ్బ కూడా ఉన్నారు. దీంతో అతడిపేరు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
24 ఏళ్లలోపువారే..
ఇదిలా ఉంటే.. డోజ్‌లో ఆరుగురిని నియమించగా అందరూ 19 నుంచి 24 ఏళ్లలోపువారే. వీరిలో కొందరు ఇటీవలే కాలేజీ విద్యను పూర్తి చేశారు. ఒకరు ఇంకా చదువు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ పాలనా వ్యవహారాలకు సంబంధించిన ఎలాంటి అనుభవం లేనివారిని డోజ్‌లో ఉద్యోగులుగా నియమించడం అగ్రరాజ్యంలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వానికి సంబంధించిన సున్నితమైన డేటాను తెలుసుకునేందుకు డోజ్‌కు అనుమతి ఉన్న నేపథ్యంలో యువ ఉద్యోగుల నియామకాలపై ఆందోళన వ్యక్తమవుతోంది.
ఎవరీ ఆకాశ్ బొబ్బ..
ఇక కొత్తగా తీసుకున్న ఆరుగురిలో ఉన్న భారత సంతతికి చెందిన యువకుడు ఆకాశ్ బొబ్బ గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అయితే పూర్తి వివరాలు తెలియరాలేదు. మరోవైపు అతడికి లింక్డ్ ఇన్ ఫ్రొఫైల్ కూడా డిలీట్ అయింది. అంతకు ముందు ఉన్న వివరాల ప్రకారం.. ఆకాశ్ బెర్కెలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో మేనేజ్‌మెంట్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్‌కు హాజరయ్యాడు. మెటా వలంటీర్ సంస్థల్లో ఇంటర్న్ పనిచేశాడు. ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ బ్రిడ్జ్వ్‌టర్ అసోసియేట్స్‌లోనూ కొంతకాలం పనిచేశాడు. ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్‌లో నిపుణుడు అని సమాచారం.
డోజ్‌లో వీరు..
ఇదిలా ఉంటే.. డోస్‌లో ఆకాశ్ బొబ్బతోపాటు ఎడ్వర్డ్ కొరిస్టీన్, ల్యూక్ ఫారిటర్, గౌంటియర్ కోల్ కిలయాన్, గావిన్ క్లిగెర్, ఇథాన్ షావోత్రను ఉద్యోగులుగా నియమించారు. వీరిలో షావోత్రన్ హార్వర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చివరి సంవత్సరం చదువుతున్నట్లు సమాచారం. గతంలో మస్క్ ఎక్స్‌ప్రెస్ నిర్వహింఇన హ్యాకథాన్‌లో ఇతను రన్నరప్‌గా నిలిచాడు.