Laknavaram Lake: వీకెండ్ రాగానే.. చాలా మంది ప్రశాంతమైన వాతావరణంలో గడపాలని భావిస్తున్నారు. వారంలోని ఒత్తిడి నుంచి రిలీఫ్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం దగ్గరలో ఉన్న టూరిస్టు స్పాట్‌ను ఎంచుకుంటున్నారు. తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాల్లో పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. దీంతో ఎక్కడివారు అక్కడికి వెళ్లి సేద తీరుతుంటారు. మంచి పర్యాటక కేంద్రం అయితే పక్క జిల్లాల నుంచి కూడా వస్తారు. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు దగ్గరలో ఉన్న పర్యాటక కేంద్రాల్లో లక్నవరం ఒకటి. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ శివారులో ఉంది. ఇక్కడి సరస్సుపై ఇప్పటికే వేలాడే వెంతెన పర్యాటకులను ఆకర్షిస్తోంది. ప్రకృతి రమణీయత, పక్షుల కిలకిలా రావాలు.. పచ్చని అడవి… ఇలా అనేకం ఆకట్టుకుంటున్నాయి. ఇక లక్నవరం జలాశయంలో ఇప్పటికే రెండు ద్వీపాలు ఉన్నాయి. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచుతున్నాయి. తాజాగా మరో టూరిజం స్పాట్ అందుబాటులోకి వచ్చింది.
మరో ద్వీపం..
లక్నవరం సరస్సులో మూడో ద్వీపం కూడా ముస్తాబైంది. జలాశయంలో సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఉంది. టీఎస్‌టీడీసీ, ఫ్రీ కోట్స్ సంస్థ సంయుక్తంగా దీనిని అభివృద్ధి చేశాయి. పర్యాటకులకు ఆహ్లాదానికి ప్రాధాన్యం ఇస్తూ అందంగా తీర్చిదిద్దారు. మూడో ఐలాండ్‌లో మొత్తం 22 కాటేజీలు ఉన్నాయి. ఇందులో నాలుగింటిని కుటుంబ సభ్యులతో బస చేసేలా నిర్మించారు. నాలుగింటిని వ్యక్తిగత కాటేజీలను కనెక్టు చేస్తూ నిర్మించారు. పిల్లల కోసం ప్రత్యేకమైన ఈత కొలను ఆట వస్తువులు ఏర్పాటు చేశారు.
స్పాలు.. రెస్టారెంట్లు..
ఇక ఇక్కడ పెద్దల కోసం స్పాలు, రెస్టారెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలైన మాల్దీవులు, మున్నార్, శిమ్లా తదితర ప్రాంతాలను తలపించేలా ఈ ఐలాండ్‌ను అభివృద్ధి చేశారు. ఫ్రీ కోట్స్‌కు చెందిన సుమారు 40 మంది సిబ్బంది ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు.
దూరం ఇలా…
లక్నవరం హైదరాబాద్ నుంచి 210 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వరంగల్ సిటీ నుంచి 70 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దట్టమైన అడవులు, కొండల మధ్య ఈ సరస్సు ఏర్పడింది. ప్రకృతి సౌందర్యానికి నిలయం. లక్నవరం లేక్ కాకతీయుల కాలంనాటిది. ఇక ఈ సరస్సును చరిత్ర కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు నిర్మించారు. ఈ సరస్సు చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు భారీగా పర్యటకులు వస్తున్నారు. లక్నవరంలో ద్వీపాలతోపాటు కేబుల్ బ్రిడ్జి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: It is the third island that has become accessible in laknavaram lake
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com