https://oktelugu.com/

KCR : చంద్రబాబు ఓడిపోయేందుకు వేమూరి రాధాకృష్ణ కారణమా.. కేసీఆర్ ఇలా ఇరికించాడేంటి?

ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది. అది క్రమేపి విస్తరించుకుంటూ వెళ్ళింది. చివరికి సాక్షిలో కెసిఆర్ నేరుగా పేరు పెట్టి విమర్శించేంత స్థాయికి ఎదిగింది. మరి ఈ కోపాలు తాపాలు ఎన్ని రోజులు ఉంటాయి.. బావా బామ్మర్దుల మధ్య ఇది తాత్కాలికమేనా.. లేకుంటే శాశ్వతమా.. ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి

Written By:
  • NARESH
  • , Updated On : May 10, 2024 / 11:05 PM IST

    kcr-cbn-abn-666-08-1507461728

    Follow us on

    KCR : కూటమి అధికారంలోకి వస్తుందని.. జగన్ పీడ విరగడవుతుందని.. ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ సంబరపడిపోతున్నాడు. తన పేపర్లో రోజుకు పేజీల కొద్దీ వార్తలను వండి వార్చుతున్నాడు. (ఆఫ్ కోర్స్ గత ఐదు సంవత్సరాలుగా జగన్ ప్రభుత్వం మీద రాయని వార్త అంటూ లేదు. ప్రతి పథకంలోనూ రంధ్రాన్వేషణే కదా.) కానీ అలాంటి రాధాకృష్ణ ఉత్సాహం మీద కెసిఆర్ నీళ్లు కుమ్మరించాడు. అసలు రాధాకృష్ణ అనే వాడు ఒక జర్నలిస్టా అని తేల్చి పడేశాడు. అంతేకాదు గత ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయేందుకు ప్రధాన కారణం రాధాకృష్ణ అని సంచలన ఆరోపణలు చేశాడు. వాస్తవానికి రాధాకృష్ణ మీద కేసీఆర్ కు ఎందుకు కోపం ఏర్పడిందో తెలియదు కానీ.. తొలిసారి నేరుగా పేరు ప్రస్తావించి విమర్శించాడు.

    పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని కెసిఆర్ బస్సు యాత్ర చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా పార్లమెంటు స్థానాలకు సంబంధించి కీలకమైన నగరాలలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇలా బహిరంగ సభకు హాజరయ్యేందుకు కేసీఆర్ వెళ్తుండగా.. సాక్షి టీవీ ఇంటర్వ్యూ చేసింది. (అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కెసిఆర్ మీడియా ప్రతినిధులందరికీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు) సహజంగానే సాక్షికి కేసీఆర్ అంటే ఇష్టం. ఆయన పది సంవత్సరాలు పరిపాలించిన కాలం అది మరో నమస్తే తెలంగాణ అయింది. దానికి మించి గులాబీ డప్పు కొట్టింది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకమైన స్టాండే తీసుకుంది. సో అలాంటప్పుడు అది ప్రో కేసిఆర్ యాంగిల్ లోనే వార్తలను ప్రజెంట్ చేస్తోంది.

    బస్సు యాత్రలో భాగంగా కేసీఆర్ ను.. సాక్షి చంద్రబాబు వ్యతిరేక కోణంలో ప్రశ్నలు అడిగింది. అసలే అధికారం పోయి ఉన్నాడు. పైగా ఆ రేవంత్ రెడ్డి చంద్రబాబు క్యాంపు మనిషి. 2019 ఎన్నికల్లో కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ పంపితే.. 2023 ఎన్నికల్లో చంద్రబాబు (అప్పటికి జైల్లో ఉన్నప్పటికీ) రేవంత్ రూపంలో తిరిగి గట్టి రిటర్న్ గిఫ్ట్ పంపించాడు. సో దెబ్బకు దెబ్బ. చెల్లుకు చెల్లు. కానీ అలా ఊరుకునే రకం కాదు కదా కేసీఆర్.. అందుకే కోపంతో రగిలిపోయాడు. ఇప్పటికీ రగిలిపోతూనే ఉన్నాడు.. ఈ తరుణంలోనే రేవంత్ ముఖ్యమంత్రి అయ్యేందుకు కారకుల్లో ఒకడైన వేమూరి రాధాకృష్ణ మీద అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. పైగా సాక్షి యాంకర్ వేమూరి రాధాకృష్ణ కు వ్యతిరేక కోణంలో ప్రశ్న అడగడంతో.. దానికి మించి అనే విధంగా కేసీఆర్ బదులిచ్చాడు.

    వాస్తవానికి కెసిఆర్, వేమూరి రాధాకృష్ణ మధ్య మంచి స్నేహం ఉంది. గతంలో టిడిపిలో కేసీఆర్ ఉన్నప్పుడు.. అప్పట్లో పాత ఆంధ్రజ్యోతి పేపర్ లో టిడిపి బీట్ రిపోర్టర్ గా వేమూరి రాధాకృష్ణ పనిచేసేవాడు. అలా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. అది కాస్తా కుటుంబ సంబంధం గా ఏర్పడింది. 2014లో భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లల్లో కెసిఆర్ కు, రాధాకృష్ణకు ఇలాగే గ్యాప్ ఏర్పడింది. కొద్దిరోజులపాటు ఏబీఎన్ ఛానల్ పై కేసీఆర్ నిషేధం విధించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరి మధ్య మళ్ళీ మాటలు మొదలయ్యాయి. కెసిఆర్ ఆయత చండీయాగం నిర్వహిస్తే.. దానికి వేమూరి రాధాకృష్ణ హాజరయ్యారు. వేమూరి రాధాకృష్ణ పేపర్ ఆఫీస్ కాలిపోతే.. కెసిఆర్ పరామర్శించారు.. ఆమధ్య వేముల రాధాకృష్ణ కూడా కెసిఆర్ కు అనుకూలంగా వార్తలు రాశారు. తర్వాత మళ్లీ ఎక్కడ చెడిందో తెలియదు గానీ.. ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది. అది క్రమేపి విస్తరించుకుంటూ వెళ్ళింది. చివరికి సాక్షిలో కెసిఆర్ నేరుగా పేరు పెట్టి విమర్శించేంత స్థాయికి ఎదిగింది. మరి ఈ కోపాలు తాపాలు ఎన్ని రోజులు ఉంటాయి.. బావా బామ్మర్దుల మధ్య ఇది తాత్కాలికమేనా.. లేకుంటే శాశ్వతమా.. ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.