https://oktelugu.com/

IPL 2024 : బెంగళూరు ప్లే ఆఫ్ వెళ్లాలంటే.. ఆ జట్టు పరాజయం పొందాలి..

ఒకవేళ ఈ రెండు మ్యాచ్లలో ఏదో ఒక దాంట్లో గుజరాత్ గెలిస్తే.. బెంగళూరుకు ఇబ్బంది ఏర్పడుతుంది. అయితే గుజరాత్ గెలిచే మ్యాచ్ స్వల్ప తేడాతో ఉంటే బెంగళూరుకు పెద్ద కష్టం ఉండదు. అప్పుడు టాప్ - 4 లో చేరి.. ప్లే ఆఫ్ ఆడుతుంది.

Written By:
  • NARESH
  • , Updated On : May 10, 2024 / 10:59 PM IST

    pbks-vs-rcb-ipl2024-

    Follow us on

    IPL 2024 :  ఐపీఎల్ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే ముంబై , పంజాబ్ జట్లు ప్లే ఆఫ్ నుంచి బయటికి వెళ్లిపోయాయి. వరుస ఓటములతో ఇంటిదారి పట్టాయి. పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాలలో ఉన్న కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ప్లే ఆఫ్ వెళ్లడం దాదాపుగా ఖాయమైనట్టే.. ఈ రెండు జట్ల తర్వాత స్థానంలో ఉన్న హైదరాబాద్ కు కూడా ప్లే ఆఫ్ వెళ్లేందుకు అవకాశం ఉంది. ఇక మిగిలిన ఒకే ఒక స్థానం కోసం పోటీ జోరుగా సాగుతోంది. ఈ స్థానం కోసం చెన్నై, లక్నో, ఢిల్లీ, బెంగళూరు తీవ్రంగా పోటీ పడుతున్నాయి..

    ఈ సీజన్లో బెంగళూరు దారుణంగా ఆడింది. తొలి ఎనిమిది మ్యాచ్లలో ఒకే ఒక్క విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నాలుగు మ్యాచ్లలో వరుసగా గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి చేరుకుంది.. ప్రత్యర్థులను దారుణంగా ఓడించి నెట్ రన్ రేట్ ను మరిత బలోపేతం చేసుకుంది. ప్రస్తుతం ఢిల్లీ, లక్నో జట్ల కంటే బెంగళూరు రన్ రేట్ బాగుండడం విశేషం. అయితే సాంకేతికంగా బెంగళూరు ప్లే ఆఫ్ విభాగంలో పోటీలో ఉన్నప్పటికీ.. ఆ జట్టు ప్లే ఆఫ్ కు చేరుకోవడం అంత సులభం కాదు. వచ్చే రెండు మ్యాచ్లలో బెంగళూరు ఘన విజయాలు సాధించాలి. అంతేకాదు ఇతర జట్ల ఫలితాల కోసం ఎదురు చూడాలి. బెంగళూరు తన సొంత మైదానంలో చెన్నై, ఢిల్లీ జట్లతో తలపడుతుంది. ఈ రెండు మ్యాచ్లలో బెంగళూరు భారీ విజయాలు సాధించాలి. అప్పుడే నెట్ రన్ రేట్ గణనీయంగా పెరుగుతుంది.

    ఈ రెండు మ్యాచ్లు మాత్రమే కాదు, చెన్నై జట్టును గుజరాత్ టైటాన్స్ ఓడించాలి. అలాగే చేపాక్ మైదానం వేదికగా జరిగే మ్యాచ్లో చెన్నై జట్టుపై రాజస్థాన్ విజయం సాధించాలి. అలాగే ముంబై జట్టు లక్నోను ఓడించాలి. ఇవి మాత్రమే కాదు, గుజరాత్ ను కోల్ కతా లేదా హైదరాబాద్ జట్లు ఓడించాలి. ఒకవేళ ఈ రెండు మ్యాచ్లలో ఏదో ఒక దాంట్లో గుజరాత్ గెలిస్తే.. బెంగళూరుకు ఇబ్బంది ఏర్పడుతుంది. అయితే గుజరాత్ గెలిచే మ్యాచ్ స్వల్ప తేడాతో ఉంటే బెంగళూరుకు పెద్ద కష్టం ఉండదు. అప్పుడు టాప్ – 4 లో చేరి.. ప్లే ఆఫ్ ఆడుతుంది.