https://oktelugu.com/

Koratala Siva’s : కొరటాల శివ నెక్స్ట్ సినిమా మీద క్లారిటీ రావడం లేదా..?ఆయన ఆ ఇద్దరు హీరోలనే టార్గెట్ చేశాడా..?

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించిన వాళ్లకు మాత్రమే మంచి గుర్తింపైతే ఉంటుంది. ఫెయిల్యూర్స్ వచ్చే దర్శకులను గాని, హీరోలను గాని ఎవరు పట్టించుకోరు. అందుకే ఎవరికి వారు ఇక్కడ సక్సెస్ ఒకటే టార్గెట్ గా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 18, 2024 / 09:10 AM IST

    Is there no clarity on Koratala Siva's next movie? Did he target those two heroes?

    Follow us on

    Koratala Siva’s : తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వాళ్లలో కొరటాల శివ ఒకరు. ఈయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో రైటర్ గా చేశారం. ఆ తర్వాత ప్రభాస్ తో చేసిన మిర్చి సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో డైరెక్టర్ గా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక అప్పటినుంచి వరుసగా శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అను నేను సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. ఇక ఆచార్య సినిమాతో దెబ్బ పడినప్పటికి ఇప్పుడు ఎన్టీఆర్ తో చేసిన ‘దేవర ‘ సినిమా పర్లేదు అనిపించుకోవడంతో ఆయనకు డైరెక్టర్ గా పాన్ ఇండియాలో మంచి గిరాకీ అయితే పెరిగిందనే చెప్పాలి. ఇక అందులో భాగంగానే ఆయన రీసెంట్ గా కొంతమంది హీరోలను కూడా కలిసి కథలు వినిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో ముఖ్యంగా రజనీకాంత్ ని టార్గెట్ చేసి అతనికి ఒక మంచి కథను కూడా రాశారట. దాంతోపాటుగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ షారుక్ ఖాన్ తో కూడా ఆయన ఒక సినిమా చేయాలని కోరుకుంటున్నాడు. మరి వీళ్ళిద్దరిలో ఆయనకు అవకాశం ఇఛేది ఎవరు అనేదానిమీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. మరి మొత్తానికైతే ఈయన చేయబోయే సినిమా ఏ జానర్ కు చెందింది అనేదానిమీద సరైన క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు ఆయన మన హీరోలతో కాకుండా ఇతర భాషల హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.

    ఇక ప్రస్తుతానికి తెలుగు హీరోలు ఎవ్వరు కూడా ఖాళీగా లేకపోవడం దానికి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇక మొత్తానికైతే కొరటాల శివ తను అనుకున్నట్టుగానే ఇతర భాషల హీరోలతో సినిమాలను చేసి సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక దేవర సినిమాకి మొదట్లో నెగటివ్ టాక్ వచ్చినప్పటికి, ఆ తర్వాత నెమ్మదిగా కలెక్షన్స్ ను పెంచుకుంటూ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

    మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా నిలిచిందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా యూనిట్ నుంచి భారీ కలెక్షన్స్ వచ్చినట్టుగా అనౌన్స్మెంట్స్ కూడా వస్తున్నాయి.

    ఇక దీంతో ఎన్టీఆర్ అభిమానులు చాలా ఆనందానికి గురవుతున్నారనే చెప్పాలి. మొత్తానికైతే ఎన్టీఆర్ చేసిన ఈ ప్రయత్నం సూపర్ సక్సెస్ కావడం కొరటాల శివ, ఎన్టీయార్ లకు చాలా మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ వార్ 2 సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో కొరటాల శివ కూడా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది…