CM Revanth Reddy: ఏపీలో చంద్రబాబే గెలుస్తున్నాడని రేవంత్ రెడ్డి ఫిక్స్ అయ్యాడా..?

రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ లోని టిడిపి నేతలతో ఇప్పటికీ సత్సంబంధాలున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటికీ ఆయన ఏపీ టిడిపి నేతలతో సఖ్యత గానే ఉంటారనే పేరుంది.

Written By: Neelambaram, Updated On : May 22, 2024 4:56 pm

CM Revanth Reddy

Follow us on

CM Revanth Reddy: ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారనే విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓ అంచనాకు వచ్చేసినట్లే అనిపిస్తుంది. బుధవారం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. తన మనవడి పుట్టు వెంట్రుకలు తీయించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీలో కొత్తగా ఏ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందనే అంశంపై తనదైన స్టైల్ లో సంకేతాలు ఇచ్చారు.ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులం కలిసి ఇరు రాష్ట్రాల అభివృద్ధికి పరస్పరం సహకరించుకుంటామని అభిప్రాయపడ్డారు.

రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ లోని టిడిపి నేతలతో ఇప్పటికీ సత్సంబంధాలున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటికీ ఆయన ఏపీ టిడిపి నేతలతో సఖ్యత గానే ఉంటారనే పేరుంది. ఈ నేపథ్యంలోనే ఆయన తిరుమలకు వెళ్లిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా టిడిపి అధినేత చంద్రబాబును ఉద్దేశించి చేసిన కామెంట్స్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. బహుశా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ఇంటెలిజెన్స్ నుంచి స్పష్టమైన సమాచారం ఉండడం వల్లే ఏపీలో ఏ ప్రభుత్వం ఏర్పడబోతుందనే అంశంపై పరోక్షంగా చంద్రబాబు విషయంలో అనుకూలమైన సంకేతాలను ఇచ్చి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు ఏపీలో కనుక ఈసారి ప్రజలు టిడిపికి పట్టం కడితే రేవంత్ రెడ్డికి కూడా రాజకీయంగా మరింత అనుకూలమైన వాతావరణ ఏర్పడుతుందని ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రెండు రాష్ట్రాల మధ్య సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం కనిపిస్తోంది. సాగర్, శ్రీశైలం నీటి పంపిణీ వ్యవహారాలు ఓ కొలిక్కి రానున్నాయి. జూన్ 02తో ఏపీ రీ-ఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం హైదరాబాద్ పై ఆంధ్రప్రదేశ్ హక్కులను కోల్పోనుంది. పదేళ్ల క్రితం ఏపీకి హైదరాబాదులో కొన్ని భవనాలు కేటాయించబడ్డాయి. అవన్నీటిపై కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకోవాల్సి ఉంది. ఏపీ కేటాయించిన భవనాలను తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ అప్పగించాల్సి ఉంటుంది. అందువల్ల ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డితో ఉన్న రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలకు త్వరగా పరిష్కారం దొరకునున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.