https://oktelugu.com/

Kajal Aggarwal: ఏంటి ఐశ్వర్యారాయ్ తో కాజల్ అగర్వాల్ నటించిందా? పిక్ వైరల్

కాజల్ మొదటిసారి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాతో వస్తుండటంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకున్నాయి. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా గడుపుతోంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : May 22, 2024 / 04:46 PM IST

    Kajal Aggarwal

    Follow us on

    Kajal Aggarwal: లక్ష్మీ కళ్యాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కాజల్ అగర్వాల్. ఈ సినిమాతోనే ఎంతో మందిని మెప్పించింది. ఎంట్రీనే అద్భుతంగా నటించడంతో దాదాపు 17 ఏళ్లుగా వరుస సినిమాలు చేస్తుంది అమ్మడు. కరోనా సమయంలో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన అమ్మడు పెళ్లి చేసుకొని ఓ ఇంటికి కోడలిగా వెళ్లింది. ఆ తర్వాత ఒక బాబు కూడా పుట్టాడు. ఇప్పుడు మళ్ళీ ‘సత్యభామ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అయింది కాజల్ అగర్వాల్.

    ఇదిలా ఉంటే కాజల్ మొదటిసారి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాతో వస్తుండటంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకున్నాయి. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో పలు ఆసక్తికర విషయాలు తెలిపింది అమ్మడు. అయితే ఈ క్రమంలో తను సినీ పరిశ్రమలోకి అధికారికంగా ఎంట్రీ ఇవ్వకముందు ఓ సినిమాలో నటించిందట.

    కాజల్ అగర్వాల్ లక్ష్మి కళ్యాణం సినిమాతో 2007లో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ అంతకు ముందే 2004 లో ‘క్యూన్ హో గయా నా’ అనే హిందీ సినిమాలో చిన్న పాత్ర చేసిందట ఈ అమ్మడు. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, వివేక్ ఒబెరాయ్, సునీల్ శెట్టి.. పలువురు ముఖ్య పాత్రల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ చెల్లె పాత్రలో నటించిందట కాజల్. అయితే ఆ పాత్ర కొద్దిసేపు మాత్రమే తెరపై కనిపిస్తుంది.

    ఈ విషయంపై కాజల్ మాట్లాడుతూ.. ముంబైలో ఉన్నప్పుడు తెలిసిన వాళ్ళ ద్వారా ఆ పాత్ర వచ్చింది అని తెలిపింది. అప్పటికి తనకు సినిమాల్లోకి వెళ్ళాలి అనే ఆలోచన కూడా రాలేదట. కేవలం వచ్చింది అని చేసిందట. ఆ పాత్రకు తనకు ఎలాంటి రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదట. సరదాగా వెళ్లి సరదాగా చేసేసాను అంటూ తెలిపింది కాజల్ అగర్వాల్.