HomeతెలంగాణTelangana  Rains : అల్పపీడనం ఎఫెక్ట్‌.. ఆంధ్రప్రదేశ్‌,. హైదరాబాద్‌ వాసులకు ఈ అలెర్ట్*

Telangana  Rains : అల్పపీడనం ఎఫెక్ట్‌.. ఆంధ్రప్రదేశ్‌,. హైదరాబాద్‌ వాసులకు ఈ అలెర్ట్*

Telangana  Rains :  బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తమిళనాడుతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని దక్షణ కోస్తా జిల్లాలు అయిన ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం బుధవారం(అక్టోబర్‌ 16న) తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది. ఈమేరకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది. అల్పపీడనం దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరం దాటి రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. దీంతో హైదరాబాద్‌లోనూ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించింది. ప్రజలు బయటకు రావొద్దని తెలిపింది.

హైదరాబాద్‌కు వాతావరణ సూచన
అల్పపీడన ప్రభావం తెలంగాణపై పెద్దగా ఉండదని తెలిపింది. అయితే హైదరాబాద్‌లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆకస్మికంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్‌ తూర్పు ప్రాంతంలో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక నగరమంతా చెదురుమదురు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

రాబోయే రోజుల్లో వాతావరణం..
– 16 అక్టోబర్‌: ఉష్ణోగ్రతలు 23.0°C నుండి 30.0°C వరకు ఉంటాయి, వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు బలమైన గాలులతో ఉంటాయి.

– 17 అక్టోబర్‌: ఉష్ణోగ్రత 23.0°C మరియు 31.0°C మధ్య ఉండవచ్చు, సాయంత్రం లేదా రాత్రి సమయంలో వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.

– 18 అక్టోబర్‌: వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు మరియు బలమైన గాలులతో సమానమైన పరిస్థితులు, ఉష్ణోగ్రతలు 23.0°C నుంచి 31.0°C వరకు ఉంటాయి.

– 19 అక్టోబర్‌: బలమైన గాలులతో వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు, ఉష్ణోగ్రతలు 23.0°C మరియు 30.0°C మధ్య ఉంటాయి.

– 20 అక్టోబరు: మరో రోజు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు, ఉరుములతో కూడిన జల్లులు, ఉష్ణోగ్రతలు 23.0°C నుండి 30.0°C వరకు ఉంటాయి.

– 21 అక్టోబర్‌: వర్షపాతం కొనసాగుతుందని అంచనా.

– 22 అక్టోబర్‌: 23.0°C మరియు 29.0°C మధ్య ఉష్ణోగ్రతలతో వర్షం కురిసే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular