Hanumakonda District: ఇటీవల ఓ ప్రభుత్వ కార్యక్రమం జరిగినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావోద్వేగంతో మాట్లాడారు. తల్లిదండ్రుల బాగోగులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల నుంచి 10 శాతం మినహాయించుకుని.. తల్లిదండ్రుల ఖాతాలో వేస్తామని అన్నారు. ఈ నిర్ణయం పట్ల తెలంగాణ సమాజం నుంచి సానుకూల స్పందన వ్యక్తం అయింది. మెజారిటీ తల్లిదండ్రులు ముఖ్యమంత్రి నిర్ణయానికి చప్పట్లు కొట్టారు. అయితే ఇది ఎంతవరకు అమల్లోకి వస్తుందో తెలియదు కానీ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని అమలు చేయడాని కంటే ముందే.. ఓ వ్యక్తి తన కొడుకు వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోనే సంచలన వ్యక్తిగా పేరు గడించాడు.
అతని పేరు శ్యాంసుందర్. పేరుపొందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుత హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి మండలానికి ఎంపీపీగా పని చేశారు. ఆయనకు ప్రజల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. శ్యాంసుందర్ భార్య ఇటీవల మరణించింది. అప్పటినుంచి ఆయన ఒంటరిగా ఉంటున్నారు. శ్యాంసుందర్ కు భారీగానే ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తుల కోసం కొడుకు రంజిత్ రెడ్డి ఆయనను ఇబ్బంది పెడుతున్నాడు. పైగా ఆస్తి తన పేరు మీద రాయాలని దాడి కూడా చేశాడు. కొడుకు దాడికి భయపడిన శ్యాంసుందర్ కొంతమేర ఆస్తిని కొడుకు పేరు మీద రాశాడు. ఆ తర్వాత మిగతా ఆస్తి విషయంలో శ్యాంసుందర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. అతడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపుతోంది.
శ్యాంసుందర్ కు మూడు ఎకరాల భూమి ఎల్కతుర్తి గ్రామంలో ఉంది. దీని విలువ మూడు కోట్ల వరకు ఉంటుంది. ఈ భూమిని శ్యాంసుందర్ ప్రభుత్వానికి రాసి ఇచ్చారు. ఇందులో ప్రభుత్వ పాఠశాల మీద కళాశాల నిర్మించి.. భార్య పేరు పెట్టాలని కోరారు. శ్యాంసుందర్ రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు మండలంలో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశారు. మండల మొత్తంలో సిసి రోడ్లు నిర్మించి రికార్డు సృష్టించారు. అప్పట్లోనే సైడ్ డ్రైనేజీలు కూడా నిర్మించి పారిశుద్ధ్య సమస్యకు పరిష్కార మార్గం చూపించారు. రాజకీయాలలో సంపాదించుకునే నేతలు ఉన్న నేటి కాలంలో.. శ్యాంసుందర్ చాలావరకు పోగొట్టుకున్నారు. ఉన్న ఆస్తులను చూసుకుంటూ జీవిస్తున్న ఆయనకు.. సతీ వినియోగం కలగడంతో ఒక్కసారిగా ఒంటరి అయిపోయాడు. భార్య లేని బాధ అతడిని తీవ్రంగా కుంగ తీయడం మొదలుపెట్టింది. దీంతో ఒంటరిగానే ఉంటున్నాడు. పైగా చరమాంకంలో ఉంటున్న తండ్రిని చేరదీయాల్సిన కొడుకు దూరం పెట్టాడు. ఆస్తికోసం ఇబ్బంది పెట్టాడు. ఒకసారి దాడి కూడా చేశాడు. అతడు దాడి చేసినప్పుడు శ్యాంసుందర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్తికోసం కొడుకు ఇంతటి దారుణానికి ఒడి కట్టడంతో శ్యాంసుందర్ తట్టుకోలేకపోయాడు.
తనకు విలువైన భూములు ఉన్న నేపథ్యంలో వాటిని మొత్తం ప్రభుత్వానికి రాసి ఇచ్చాడు. అందులో విద్యాలయాలు నిర్మించాలని విన్నవించాడు. ఒకవేళ అందులో గనుక విద్యాలయాలు నిర్మిస్తే తన భార్య పేరు పెట్టాలని కోరాడు. శ్యాంసుందర్ తీసుకున్న నిర్ణయం సంచలనం కలిగిస్తోంది. మరోవైపు శ్యాంసుందర్ కుమార్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ వ్యక్తం అవుతుంది. శ్యాంసుందర్ ప్రభుత్వానికి భూములు రాసిచ్చిన నేపథ్యంలో ఆయనతో మాట్లాడేందుకు చాలా మంది వెళ్తున్నారు. ఈ సందర్భంగా తనను కలిసేందుకు వచ్చేవారితో శ్యాంసుందర్ తన ఆవేదన పంచుకుంటున్నాడు.