https://oktelugu.com/

 Hyderabad : హైదరాబాద్‌లో కాంగ్రెస్ vs బీఆర్ఎస్సే.. బీజేపీ ఎక్కడ?

రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య ఇంత యుద్ధం జరుగుతుంటే బీజేపీ సైలెంట్ అయింది. దీంతో బీజేపీ మౌనంపై ఇప్పుడు ఆ పార్టీలోనే కాకుండా.. ఇతర పార్టీల్లోనూ జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రాంతీయత అంశాన్ని లేవనెత్తారు. ఆ వ్యాఖ్యలు కాస్త పెద్ద దుమారమే రేపాయి. తెలంగాణ, ఆంధ్ర అంటూ చేసిన వ్యాఖ్యలపై అంతటా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : September 13, 2024 / 04:26 PM IST

    Hyderabad politics

    Follow us on

    Hyderabad :  శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య నెలకొన్ని వివాదం హైదరాబాద్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. ఇద్దరు నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయమే మారిపోయింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా గత మూడు రోజులుగా వివాదం కొనసాగుతూనే ఉంది.

    రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య ఇంత యుద్ధం జరుగుతుంటే బీజేపీ సైలెంట్ అయింది. దీంతో బీజేపీ మౌనంపై ఇప్పుడు ఆ పార్టీలోనే కాకుండా.. ఇతర పార్టీల్లోనూ జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రాంతీయత అంశాన్ని లేవనెత్తారు. ఆ వ్యాఖ్యలు కాస్త పెద్ద దుమారమే రేపాయి. తెలంగాణ, ఆంధ్ర అంటూ చేసిన వ్యాఖ్యలపై అంతటా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది ఆ వ్యాఖ్యలను ఖండిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో దీనిని క్యాష్ చేసుకోవాల్సిన బీజేపీ సైలెంటుగా ఉండిపోవడంపై ఆ పార్టీలోని క్యాడర్ కూడా అసంతృప్తితో ఉందని టాక్ నడుస్తోంది.

    రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రం ఆ పార్టీకి చెప్పుకోదగిన బలం లేదు. కానీ.. బీజేపీకి మాత్రం అంతోఇంతో బలం ఉంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లను గెలిపించుకుంది. ఇప్పుడు ఆ పార్టీకి నగరంలోని కార్పొరేటర్లు సైతం పెద్ద బలం. ఇదిలా ఉంటే.. మరో ఏడాదిన్నరలో గ్రేటర్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ నేత చేసిన వ్యాఖ్యలను అస్త్రంగా మలచుకోవాల్సింది పోయి ఇలా మిన్నకుండడంపైనా విమర్శలు వస్తున్నాయి.

    రాష్ట్రంలో బీజేపీకి ఎమ్మెల్యేలు, ఎంపీల బలం కూడా పెరిగింది. గత రెండు ఎన్నికల్లోనూ ఆ పార్టీ సత్తా చాటింది. ఓటు బ్యాంకును సైతం పెంచుకుంది. అయితే.. ఈ క్రమంలో నగరంలో ఓ రేంజ్‌లో కొనసాగుతున్న ఈ వివాదంపై బీజేపీ కూడా తన స్టాండ్‌ని వినిపిస్తే బాగుండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. కేసీఆర్‌ను.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తూర్పారపడితే పార్టీకి మరింత మైలేజీ వచ్చేదని టాక్ నడుస్తోంది. దీని వెనుక ఉన్న కారణం ఏంటా అనేది ఎవరికీ అర్థం కాని విషయం. రాష్ట్రంలో ఏ చిన్న గొడవ జరిగినా.. ఏ సమస్య వచ్చినా ఇట్టే స్పందించే కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదనే ప్రశ్నలుూ వస్తున్నాయి. ఇప్పటికైనా ఈ అంశంపై స్పందిస్తారేమో చూద్దాం.