Opposition Parties: ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఎంత బలంగా ఉంటే.. అధికార పక్షం అంత శ్రద్ధగా పనిచేస్తుంది. అయితే ప్రతిపక్షం అనేది తన పాత్ర పోషించినప్పుడే దానికి గుర్తింపు దక్కుతుంది. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికార పక్షం వైఖరిని, నిర్ణయాలను తప్పు పట్టాలి కాబట్టి పడతాం అంటే కుదరదు. ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతలదే. కానీ దృరదృష్టం ఏమిటంటే.. నేటి రాజకీయాల్లో ప్రతిపక్ష చాలా బలహీనంగా ఉంటుంది. బలవంతుడు బలహీనుడిపై ఆధిపత్యం చెలాయించినట్లే.. అధికార పక్షం కూడా ఇప్పుడు ప్రతిపక్షాలను డామినేట్ చేస్తున్నాయి. దీంతో ప్రజలే ఏది మంచో.. ఏది చెడో ఆలోచిస్తున్నారు. సొంతంగా తమ సమస్యలపై పోరాటం చేసుకుంటున్నారు. పాలకుల ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమిస్తున్నారు. దీంతో ప్రతిపక్షాలు విధిలేక ప్రజలకు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే ఫ్రెంచ్ తిరుబాటు నేత నెపోలియన్ 120 ఏళ్ల క్రితమే ‘రాజకీయ స్టుపిడిటీ వైకల్యం కాదు’ అన్నారు. నెపోలియన్ చెప్పింది శారీక వైకల్యం గురించి కాదు. రాజకీయ నాయకుల బుద్ధి వైకల్యం గురించి. నెపోలియన్ రాజకీయ నాయకుడు కాకపోయినా రాజకీయ నేతల వైఫల్యాలను ఆసరాగా చేసుకుని 11 ఏళ్లు ఫ్రాన్స్‌ను పాలించాడు. నెపోలియన్ మాటకు ఇప్పటికీ విలువ దగ్గలేదు. రాజకీయ నేతల వైక్యం తగ్గలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు జరుగుతున్న రాజకీయాన్ని చూస్తే ఎవరికైనా.. రాజకీయ వైకల్యం గురించి ఈజీగా అర్థమవుతుంది.
ఎవరి కోసం రాజకీయాలు..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్‌మోహన్‌రెడ్డి స్టైల్ చూస్తే.. నెపోలియన్ చెప్పిన మాట ఆయనకు వందకు శాతం వర్తిస్తుంది. ఓ సారి అధికారం ఇచ్చారు. 30 ఏళ్లపాటు పరిపాలించేలా చేసుకుంటానని హామీ ఇచ్చారు. కానీ ఆయన తీరు ప్రజల్నే భయపెట్టేలా ఉండటంతో మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం చేశారు. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా లోపాల్ని సరిదిద్దుకునేందుకు ప్రయత్నించకుండా.. తాను అంతా మంచే చేశాననే వితండవాదంతో ప్రజలపై కక్ష తీర్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్షక్ష్య పూరిత మనస్తత్వమే రాజకీయాల్లో వైసీపీ ఓటమికి కారణం. తనను జైలుకు పంపించారన్న కారణంతో తాను అధికారంలో ఉన్నప్పుడు తప్పుడు కేసులు పెట్టించి టీడీపీ నేతలను జైల్లో పెట్టించారు. తానే అన్నీ అన్నట్లు వ్యవహరించారు. అదే కొంప ముంచింది. ఇప్పుడాయన ప్రజల పక్షాన పోరాడి.. మంచి ప్రతిపక్ష నేత అనిపించుకోవాల్సింది పోయి.. వివిధ కేసుల్లో అరెస్ట్ అవుతున్న పార్టీ నేతల కోసం పోరాడుతున్నారు. ప్రజల కష్టాలను గాలికి వదిలేశారు. విజయవాడ నీట మునిగినా ఒకసారి అలా వెళ్లొచ్చారు. ప్రజలకు సాయం చేయాలని నాయకులకు ఎలాంటి పిలుపు ఇవ్వలేదు. కానీ, జైల్లో ఉన్న నందిగం సురేశ్, అవుతు శ్రీనివాస్ రెడ్డి అనే క్రిమినల్స్ ను ప్రత్యేకంగా పరామర్శించడానికి జైలుకు వెళ్లారు. ఇది ఆయన రాజకీయ వైకల్యతను ఎత్తి చూపుతోంది.
పరారీలో నేతల..
జగన్ తీరు కారణంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీపై రెచ్చిపోయిన కొడాలి నాని, జోగి రమేశ్, వంశీ, అవినాష్ ఇలా చెప్పుకుంటూ పోతే 25 మంది వరకు వైసీపీ నేతలు ఇప్పుడు కనిపించడం లేదు. ఇందుకు కారణం జగన్ రాజకీయ వైకల్యమే. అధికారంలో ఉన్నప్పుడు తన పార్టీ నేతల నోటిదురుసును అడ్డుకోలేదు. ఫలితంగా ఇప్పుడు ఆ నేతలు కనిపించకుండా పోయారు. ఇంకా ఎంత మంది కనిపించకుండా పోతారో కూడా తెలియదు.
కౌశిక్‌రెడ్డి తీరుతో బీఆర్‌ఎస్ అభాసుపాలు
ఇక తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ అందులోని కొంత మంది నేతల రాజకీయ వైకల్యంలో అబాసుపాలవుతోంది. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై పోరాటం చేయడం.. వీధి పోరాటాల తరహాలో దాడులు చేసుకోవడం వెగటు పుట్టిస్తోంది. రుణమాఫీ కాలేదని ఆరోపించిన బీఆర్‌ఎస్ రైతు ఉద్యమానికి మాత్రం వెనకాడుతోంది. కేవలం నిత్యం వార్తల్లో ఉండాలి.. టీవీల్లో కనిపించాలి.. అధికార పార్టీ కన్నా.. తాము ఎక్కువగా ఫోకస్ కావాలి అన్న ధోరణే నేతల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. బలమైన ప్రతిపక్షంగా వారి తరఫున పోరాటం చేయాలి. కానీ, అలాంటి దాఖలాలు పెద్దగా లేవు. తాజాగా పాడి కౌశిక్‌రెడ్డి, పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ మధ్య నెలకొన్న వివాదం.. తర్వాతి పరిణామాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ప్రజల కోసం ఇలాంటి ఒక్క పోరాటం కూడా చేయని నేతల తీరు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.