https://oktelugu.com/

Telangana Weather : అమ్మో చలి.. రెండు రోజులు జాగ్రత్త, ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసిన ఐఎండీ..

తెలంగాణ చలితో గజ గజ వణుకుతోంది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీనికి తోడు చల్లగాలి వీస్తోంది. ఫలితంగా చలి తీవ్రత పెరుగుతోంది. జనం ఇబ్బంది పడుతున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 17, 2024 / 05:48 PM IST

    Telangana Weather

    Follow us on

    Telangana Weather :  చలి చంపేస్తోంది. వారం రోజులుగా విపరీతమైన చలి పెరిగింది. ఏటా డిసెంబర్‌లో పెరగడం సాధారణమే. కానీ, ఈసారి మరింత పెరిగింది. దీంతో వాతావరణ శాఖ కూడా అప్రమత్తమైంది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. చలి తీవ్రతకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనాల కారణంగా కూడా తెలంగాణ అంటా ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతున్నాయి. అల్పపీడనం కారణంగా చల్ల గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో వర్షాలు కూడా కురుస్తున్నాయి. డిసెంబర్‌ 17, 18 తేదీల్లో వర్షాలు పడతాయని ఐఎండీ కూడా తెలిపింది.

    తెలంగాణలో చలి..
    అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. పొగమంచు కూడా ఎక్కువగా కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఐఎండీ కొన్ని జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి తీవ్రత పెరుగుతోంది. కొన్ని జిల్లాలో 10 డిగ్రీలకు దిగువన కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు కూడా 25 డిగ్రీలకు దిగువన నమోదువుతన్నాయి. దీంతో పగలు, రాత్రి చలి పెడుతోంది. పైరగాలి ప్రభావంతో చలి ఎక్కువగా అనిపిస్తోంది.

    నేడు రేపు జాగ్రత్త..
    చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో డిసెంబర్‌ 17, 18 తేదీల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ ఆదేశించింది. ముఖ్యంగా ఆదదిలాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్‌ జిల్లాల్లో చలి మరింత పెరుగుతుందని తెలిపింది. ఈమేరకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, రవంగల్‌ జిల్లాలు బుధవారం(డిసెంబర్‌ 18న) అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

    వీరు జాగ్రత్తగా ఉండాలి…
    చలి తీవ్రత కారణంగా ఉదయం ఆఫీసులు, స్కూళ్లకు వెళ్లేవారు, ఇళ్లలోని చిన్న పిల్లలు, వృద్ధులు, వ్యవసాయ పనులు, ఇతర పనులకు వెళ్లే కూలీలు కూడా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. చలి నుంచి రక్షించుకోవడానికి ఉన్ని వస్త్రాలు, ముదురు రంగు వస్త్రాలు ధరించాలని సూచించింది. ఆస్తమా రోగులు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఇన్‌హీలర్‌ వెంట ఉంచుకోవాలని తెలిపింది.