https://oktelugu.com/

Alla Nani : రేపు సైకిల్ ఎక్కనున్న ఆళ్ల నాని.. టిడిపి శ్రేణుల అభ్యంతరం.. బాబు గ్రీన్ సిగ్నల్! ఏం జరుగుతోందంటే?*

మాజీ మంత్రి ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. టిడిపి నేతల అభ్యంతరాలతో ఇంతవరకు ఆయనకు గ్రీన్ సిగ్నల్ లభించలేదు. చంద్రబాబు చొరవ తీసుకోవడంతో ఆమోదముద్ర లభించింది.

Written By:
  • Dharma
  • , Updated On : December 17, 2024 / 05:54 PM IST

    Alla Nani joining in TDP

    Follow us on

    Alla Nani : ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు జరిగి ఆరునెలలే అవుతోంది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు సమీపిస్తోంది. అయినా సరే పొలిటికల్ ఫీవర్ ఆగడం లేదు. వైసీపీకి పెద్ద ఎత్తున నేతలు గుడ్ బై చెబుతున్నారు. కూటమి పార్టీల్లో చేరుతున్నారు.అయితే అప్పట్లో టిడిపి తో పాటు జనసేన శ్రేణులను ఇబ్బంది పెట్టిన నేతల విషయంలో మాత్రం అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మాజీ మంత్రి జోగి రమేష్ తో వేదిక పంచుకున్న టిడిపి నేతలపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.దీంతో నేతలు క్షమాపణలు చెబుతున్నారు.అయితే ఇటువంటి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్న వేళ.. మాజీ మంత్రి ఆళ్ల నాని టిడిపిలో చేరడం ఖాయమైంది. చాలా రోజుల కిందట వైసీపీకి రాజీనామా చేశారు నాని. అయితే టిడిపిలో వచ్చేందుకు పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.అయితే అది రాష్ట్రస్థాయిలో కాదు. ఏలూరు అసెంబ్లీ స్థాయిలోనే. అయితే రాజకీయ పరిణామాలతో పాటు పార్టీ బలోపేతం దృష్ట్యా ఆళ్ల నాని చేరికకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటివరకు అభ్యంతరం వ్యక్తం చేసిన ఏలూరు టిడిపి ఎమ్మెల్యేతో పాటు పార్టీ శ్రేణులు సైతం సమ్మతించాయి. హై కమాండ్ నిర్ణయమే శిరోధార్యం అంటూ ప్రకటించాయి. దీంతో ఆళ్ళ నాని టిడిపిలో చేరికకు రంగం సిద్ధమైంది.

    * వైసీపీలో ఒక వెలుగు వెలిగిన నేత
    వైసీపీలో ఒక వెలుగు వెలిగారు ఆళ్ల నాని. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన నానికి మంత్రివర్గంలో చాన్స్ ఇచ్చారు జగన్. మంత్రి పదవి ఇవ్వడంతో పాటు డిప్యూటీ సీఎం హోదా కట్టబెట్టారు.అయితే మంత్రివర్గ విస్తరణలో తప్పించారు. ఈ ఎన్నికల్లో మరోసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందారు.అయితే జగన్ ఏలూరు జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించారు. అయినా సరే పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎన్నికల తరువాత ముందుగా జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను వదులుకున్నారు. అక్కడకు కొద్ది రోజులకే పార్టీ సభ్యత్వానికి రాజీనామా ప్రకటించారు. అప్పటినుంచి పొలిటికల్ డిఫెన్స్ లో ఉన్నారు. ఆయన చేరికను ఏలూరు టిడిపి నేతలు అడ్డుకున్నట్లు వార్తలు వచ్చాయి.ఇప్పుడు తాజాగా లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.

    * రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో
    వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు ఆళ్ల నాని. 2004లో తొలిసారిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.2009లో సైతం రెండోసారి గెలుపొందారు. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో జగన్ వెంట అడుగులు వేశారు. 2014 ఎన్నికల్లో ఏలూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా సరే జగన్ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. 2019 ఎన్నికల్లో ఏలూరు నుంచి మరోసారి బరిలో దిగిన నాని విజయం సాధించారు. జగన్ క్యాబినెట్లో మంత్రి తో పాటు డిప్యూటీ సీఎం గా రెండున్నర ఏళ్లపాటు కొనసాగారు.ఈ ఎన్నికల్లో ఓటమితో రాజకీయాలనుంచి తప్పుకోవాలని భావించారు. కానీ తన మనసు మార్చుకుని టిడిపిలో చేరుతున్నారు.