Free Electricity: 200 యూనిట్లు దాటితే కరెంట్ బిల్లు కాట్టాలా..? క్లారిటీ ఇచ్చిన విద్యుత్ అధికారి!!

గృహజ్యోతి పథకం అమలవుతుండగా ఈమేరకు ప్రభుత‍్వం జారీ చేసిన మార్గదర్శకాలపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానాలను విద్యుత్ శాఖ అధికారి సూపరిడెంట్ ఇంజినీర్ గంగాధర్ నివృత్తి చేశారు.

Written By: Raj Shekar, Updated On : March 7, 2024 6:28 pm

Free Electricity

Follow us on

Free Electricity: గృహజ్యోతి పథకంలో భాగంగా తెలంగాణలో మార్చి 1 నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నారు. రేషన్‌కార్డు, అభయహస్తం పథకంలో దరఖాస్తు చేసుకున్నవారికి ఈ పథకం అమలు చేస్తున్నారు. ఇందుకోసం బిల్లింగ్‌ యంత్రాల్లో మార్పులు చేశారు. 200 యూనిట్లలోపు విద్యుత్‌ వాడిన వారికే ఇది వర్తిస్తుంది. బిల్లు ప్రింట్‌ చేసి గృహజ్యోతి సబ్సిడీ కింద మొత్తం బిల్లు మాఫీ చేసి జీరోగా చూపుతున్నారు.

మార్గదర్శకాలపై అనుమానాలు..
గృహజ్యోతి పథకం అమలవుతుండగా ఈమేరకు ప్రభుత‍్వం జారీ చేసిన మార్గదర్శకాలపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానాలను విద్యుత్ శాఖ అధికారి సూపరిడెంట్ ఇంజినీర్ గంగాధర్ నివృత్తి చేశారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు బిలో పావర్టీ వారే అర్హులని తెలిపారు. 200 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించేవారికి ఇది వర్తిస్తుందని వెల్లడించారు.

201 యూనిట్‌ వస్తే బిల్లు..
ఇక విద్యుత్‌ వినియోగం 200 యూనిట్లు దాటితే అంటే 201 యూనిట్లు వచ్చినా బిల్‌ వసూలు చేస్తారు. గత విద్యుత్‌ బిల్లు బకాయి ఉన్నవారికి కూడా ఈ పథకం వర్తించదని పేర్కొన్నారు. పెండింగ్‌ బిల్లు క్లియర్‌ చేసిన వారికే గృహజ్యోతి వర్తింపజేస్తారు.

90 శాతం అర్హులే..
గత రికార్డులను పరిశీలిసే‍్త విద్యుత్‌ వినియోగం 200 యూనిట్లకన్నా తక్కువగా ఉన్నవారే ఎక్కువగా ఉన్నారు. అయితే అందరికీ తెల్ల రేషన్‌కార్డు లేదు. దీంతో వైట్‌ రేషన్‌కార్డు ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వం గృహజ్యోతి అమలు చేస్తోంది. దీంతో అర్హత ఉన్నా రేషన్‌కార్డు లేనివారు నష్టపోతున్నారు. ఉచిత విద్యుత్‌ నేపథ్యంలో పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.