Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Telangana » Ias officer amrapali kata is the new ghmc commissioner

GHMC Commissioner: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా లేడీ సింగం.. సమర్థతకు ఛాలెంజింగ్ పోస్టు

GHMC Commissioner: గ్రేటర్‌ హైదరాబాద్‌(జీహెచ్‌ఎంసీ) కమిషనర్‌గా అమ్రపాలిని నియమించింది. ప్రస్తుత కమిషనర్‌ రొనాల్డ్‌ రాస్‌ను ట్రాన్స్‌కో కమిషనర్‌గా బదిలీ చేసింది. తెలంగాణ సర్కార్‌ తాజాగా తీసుకన్న నిర్ణయం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

Written By: Ashish D , Updated On : June 24, 2024 / 03:18 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Ias Officer Amrapali Kata Is The New Ghmc Commissioner

IAS officer Amrapali Kata is the new GHMC Commissioner

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

GHMC Commissioner: తెలంగాణ ప్రభుత్వం వారం వ్యవధిలోనే మరోమారు ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టింది. గత వారం 18 జిల్లాల కలెక్టర్లను మార్చిన ప్రభుత్వం తాజాగా 44 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఈ క్రమంలో గ్రేటర్‌ హైదరాబాద్‌(జీహెచ్‌ఎంసీ) కమిషనర్‌గా అమ్రపాలిని నియమించింది. ప్రస్తుత కమిషనర్‌ రొనాల్డ్‌ రాస్‌ను ట్రాన్స్‌కో కమిషనర్‌గా బదిలీ చేసింది. తెలంగాణ సర్కార్‌ తాజాగా తీసుకన్న నిర్ణయం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

హెచ్‌ఎండీఏ నుంచి..
అమ్రపాలి ప్రస్తుతం హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(హెచ్‌ఎండీఏ)లో జాయింట్‌ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌గా ఉనానరు. ఆమెను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా నియమిస్తూ సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల రొనాల్డ్‌ రాస్‌ సెలవుపై వెళ్లగా అమ్రపాలిని ఇన్‌చార్జిగా నియమించారు. ఆ సమయంలో విధులను సమర్థవంతంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు ప్రభుత్వ ప్రజల ప్రశంసలు పొందారు. ఈ క్రమంలో ఆమెను పూర్తి కమిషనర్‌గా నియమిస్తే సమర్థవంతగా పనిచేస్తారని భావించి ఈ నియామకం చేసినట్లు తెలుస్తోంది.

ఒంగోలులో పుట్టి...
అమ్రపాలి సొంత గ్రామం ఒంగోలు నగర చివరన ఉన్న ఎన్‌.అగ్రహారం. కాటా వెంకటరెడ్డి–పద్మావతి దంపతుల మొదటి సంతానం. విశాఖలో ఉన్న చదువులు చదివారు. ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌లో 2010 ఏఐఎస్‌ బ్యాచ్‌కు చెందిన అమ్రపాలి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకే కేటాయించారు. రాష్ట్రంలో పలు జిల్లాల కలెక్టర్‌గా పని చేశారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న సమయంలో కేంద్ర సర్వీస్‌లకు వెళ్లారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక తిరిగి రాస్ట్రానికి వచ్చారు. ఆమెను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా నియమించడంపై హర్షం వ్యక్తమవుతోంది.

Also Read: Revanth Reddy: కేసీఆర్‌ చేసిన తప్పే.. రేవంత్‌ చేస్తున్నాడు.. రిజల్డ్‌ రిపీట్‌!

లేడీ సింగంగా..
అమ్రపాలి తన పనితీరుతో లేడీ సింగంగా గుర్తింపు తెచ్చుకున్నారు. విధు నిర్వహణలో చాలా కఠినంగా వ్యవహరిస్తారు. ఎక్కడా రాజీ పడే ప్రసక్తే ఉండదు. అవతలి వాళ్లు ఎలాంటి వారైనా, ఆమె చట్ట ప్రకారం పనిచేసుకుపోతారు. ఎవ్వరినీ కేర్‌ చెయ్యరు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక ఆమెకు కీలక బాధ్యతలను అప్పగిస్తున్నారు. గతేడాది హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. 7,200 చదరపు కిలోమీటర్లు, ఏడు జిల్లాల పరిధిలో ఉన్న హెచ్‌ఎండీఏపై తన మార్కు వేశారు. దీంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ప్రమోషన్‌ లభించింఇ.

సవాళ్లు..
జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా నియమితులైన అమ్రపాలి ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. సిటీ వేగంగా విస్తరిస్తోంది. జనాభా సంఖ్య పెరుగుతోంది. ట్రాఫిక్‌ సమస్యలు చాలా ఉన్నాయి. కుక్కల పెడద పెరిగింది. వర్షాకాలంలో వరదలు నగరాన్ని ముంచెత్తుతున్నాయి. మ్యాన్‌ హోళ్లు, డ్రెయినేజీలు ప్రమాదకరంగా మారతాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ సిటీని అంతర్జాతీయ స్థాయిలో మరింతగా అభివృద్ధి వైపు నడిపించాల్సిన బాధ్యత ఆమెపై ఉంటుంది.

Also Read: AP Cabinet : నిరుద్యోగులకు ఏపీ క్యాబినెట్ గుడ్ న్యూస్

భర్త ఐపీఎస్‌..
ఇక ఆమ్రపాలి భర్త సమీర్‌ శర్మ ఐపీఎస్‌ అధికారి. 2011 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయనను 2018 ఫిబ్రవరి 18న పెళ్లి చేసుకున్నారు. సమీర్‌ శర్మది జమ్మూకశ్మీర్‌. ప్రస్తుతం ఆయన డామన్, డయ్యూలో సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌(ఎస్పీ)గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Ashish D

Ashish D Author - OkTelugu

Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

View Author's Full Info

Web Title: Ias officer amrapali kata is the new ghmc commissioner

Tags
  • Amrapali Kata
  • GHMC Commissioner
  • Telangana
  • Telugu news
Follow OkTelugu on WhatsApp

Related News

KTR to be arrested soon: కేటీఆర్‌ అరెస్ట్‌ ఖాయమా? తెలంగాణలో మరో సంచలనం

KTR to be arrested soon: కేటీఆర్‌ అరెస్ట్‌ ఖాయమా? తెలంగాణలో మరో సంచలనం

Nexa Evergreen fraud case: ఇద్దరు అన్నదమ్ములు.. 2,700 కోట్లు నొక్కేశారు…

Nexa Evergreen fraud case: ఇద్దరు అన్నదమ్ములు.. 2,700 కోట్లు నొక్కేశారు…

Inter Supplementary Results 2025: తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి

Inter Supplementary Results 2025: తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి

Malla Reddy Latest Viral Video: మల్లారెడ్డితో అట్లుంటది మరి.. వైరల్ వీడియో

Malla Reddy Latest Viral Video: మల్లారెడ్డితో అట్లుంటది మరి.. వైరల్ వీడియో

Chirutha hulchul in Kosigi: మీరు మగాళ్లు రా బుజ్జి.. ఏకంగా పులినే పట్టేశారు.. వైరల్ వీడియో

Chirutha hulchul in Kosigi: మీరు మగాళ్లు రా బుజ్జి.. ఏకంగా పులినే పట్టేశారు.. వైరల్ వీడియో

Dangerous stunt with a Tractor: ఇదేంట్రా బాబూ.. పడుకొని డ్రైవింగ్.. పోతావ్ రరేయ్.. వైరల్ వీడియో

Dangerous stunt with a Tractor: ఇదేంట్రా బాబూ.. పడుకొని డ్రైవింగ్.. పోతావ్ రరేయ్.. వైరల్ వీడియో

ఫొటో గేలరీ

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.