spot_img
HomeతెలంగాణHyderabad Commercial Real Estate Growth: హైదరాబాద్ లో చిక్కులు లేకుండా స్థలం కొనుక్కుని.....

Hyderabad Commercial Real Estate Growth: హైదరాబాద్ లో చిక్కులు లేకుండా స్థలం కొనుక్కుని.. సొంతిల్లు కట్టుకోవాలనుకుంటున్నారా..

Hyderabad Commercial Real Estate Growth: పైసా పైసా కూడబెట్టుకుని.. స్థలం కొనుక్కుంటాం. హైదరాబాద్ నగరంలో ఇల్లు కూడా కట్టకుంటున్నామని బంధువులతో గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఆ స్థలం అమ్మిన వ్యక్తి మోసం చేస్తాడు. ఆ స్థలాన్ని గతంలోనే మరో వ్యక్తికి అమ్మి.. డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తాడు. ఇక అక్కడి నుంచి మన ఇబ్బందులు మొదలవుతాయి. పోలీస్ స్టేషన్ల కు వెళ్లాలి. లాయర్లను కలవాలి. ఏన్నో ఏళ్లకు గాని ఆ కేసు పరిష్కారం కాదు. ఈలోగా ఇల్లు కట్టుకోవాలనే మన కల కలగానే మిగిలిపోతుంది.

ఇలాంటి ఇబ్బందులు హైదరాబాద్ నగరంలో చాలా మంది అనుభవించి ఉంటారు. అయితే అలాంటి వాళ్ల కోసం తెలంగాణ హౌసింగ్ బోర్డు బంగారం లాటి అవకాశాన్ని తీసుకొచ్చింది. వివాదాలు లేకుండా, స్పష్టంగా యాజమాన్య హక్కులు వచ్చేలా ప్రభుత్వ భూములను విక్రయించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రంగారెడ్డి, మేడ్చల్, మాల్కాజ్ గిరి జిల్లాలలో అత్యంత ఖరీదుగా ఉండే ప్రాంతాలలో ఎనిమిది భారీ ప్లాట్లు, ల్యాండ్ పార్సిళ్లను ఈ వేలం విధానంలో అమ్మనుంది. కేపీహెచ్ బీ కాలనీ, కుత్బుల్లాపూర్ పరిధిలో ఉన్న చింతల్, శంషాబాద్ విమానాశ్రయానికి దగ్గరలో ఉన్న రావిర్యాల వంటి ఏరియాలలో ఈ భూములను అమ్మనుంది.

ఈనెల 28న ఈ భూములను విక్రయిస్తుంది. మిడిల్ క్లాస్ వాళ్లు ఇక్కడ ఇళ్లు నిర్మించుకోవచ్చు. కార్పొరేట్ సంస్థలు విద్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చు. బహుళ వాణిజ్య సముదాయాలు నిర్మించవచ్చు. వేలం విధానంలో కనిష్టంగా 1116 చదరపు గజాల నుంచి 13504 చదరపు గజాల వరకు స్థలాలు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. చదరపు గజం కనీస ధర 26 వేలుగా ఉంది. గరిష్టంగా లక్ష రూపాయలు. ఇప్పటికే నాంపల్లి ప్రాంతంలో ప్రీ బిడ్ డిపాజిట్ నిర్వహించారు. ప్రీ బిడ్ డిపాజిట్ ప్రాంతాల ఆధారంగా రూ.25 లక్షల నుంచి కోటి వరకు ఉంది. మే 27న సాయంత్రం ఐదు గంటల వరకు ప్రి బిడ్ డిపాజిట్ చెల్లించేందుకు అవకాశం ఉంది. రావిర్యాల ప్రాంతంలో 28న, కేపీహెచ్ బీ, చింతల్ ఏరియాలలో 29న ఈ వేలం నిర్వహిస్తారు.

రావిర్యాల ప్రాంతంలో ప్లాట్ నంబర్ 1 నుంచి నాలుగు వరకు విస్తీర్ణం 1116 నుంచి 13504 చదరపు గజాల వరకు 26 వేల నుంచి 49 వేల వరకు ధర నిర్ణయించారు.

కేపీహెచ్ బీ కాలనీ, చింతల్లో ఫేజ్ 1,2 ప్లాట్లు ల్యాండ్ పార్సిల్ 1, 2, కోసం 2,420, 5,898,10,890,3,388 చదరపు గజాలకు రూ, 90 వేలు, రూ.70 వేలు, రూ. 40 వేలుగా ధరను నిర్ణయించారు.
image.png

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: ఆ 15 ఏళ్ల బుడ్డోడు బ్యాటర్ కాదు డైనమైట్.. టీమిండియా బౌలింగ్ దిగ్గజం షాకింగ్ కామెంట్స్

Vaibhav Suryavanshi: హర్భజన్ సింగ్.. టీమ్ ఇండియాలో లెజెండరీ స్పిన్ బౌలర్. ఆస్ట్రేలియా నుంచి మొదలు పెడితే న్యూజిలాండ్ వరకు ప్రతి జట్టు మీద అతడికి అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. అతడు గూగ్లీ...
Srinivasa Mangapuram

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాలో ఊహించని సర్ ప్రైజ్ లు…

Srinivasa Mangapuram: మహేష్ బాబు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన ఎలిమెంట్ ఉంటుంది. ఇక తన అన్న కొడుకు అయిన జయకృష్ణ సైతం ప్రస్తుతం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు....
Gautam Krishna

Gautam Krishna: మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ కోసం ముగ్గురు డైరెక్టర్ల ఎదురుచూపు…

Gautam Krishna: రాజకుమారుడు సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన హీరో మహేష్ బాబు... ఆ తర్వాత క్లాస్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాతో మాస్ హీరోగా అవతరించిన...
Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు అభిమానులకు చేదు వార్త.. ఊరించి దెబ్బ తీశారుగా..

Mahesh Babu: ప్రతీ ఏడాది మహేష్ బాబు అభిమానులు , తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను ఎంత గ్రాండ్ గా జరిపిస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్లు...
Jana Nayagan Box Office Collection

Jana Nayagan Box Office Collection: ‘జన నాయగన్ ‘ కి డిజాస్టర్ టాక్.. కానీ మ్యాట్నీ షోస్...

Jana Nayagan Box Office Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళం ,...
Oktelugu Epaper