https://oktelugu.com/

Tiger: వందల కిలోమీటర్లు తిరిగినా.. ఆడ తోడు దొరకలేదు..పాపం పెద్దపులి.. గత్యంతరం లేక ఏం చేసిందంటే..

మనుషులకే కాదు జంతువులకు కూడా ఇష్టాలుంటాయి, ప్రేమలుంటాయి, కోరికలూ ఉంటాయి. అదేదో సినిమాలో సుకుమార్ చెప్పినట్టు.. నిద్ర, ఆకలి, శృంగారం అనేవి మనుషులతో పాటు జంతువులకూ ఉంటాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 18, 2024 / 03:22 PM IST

    Tiger(2)

    Follow us on

    Tiger: అసలే అతి పెద్ద పులి. పైగా వయసు మీద ఉంది. హార్మోన్లు యుద్ధం చేస్తుంటే కోరికలతో రగిలిపోయింది. ఆడ తోడు కోసం వెతికింది. ఎక్కడ కూడా అడగాలి కనిపించలేదు. తన ఉన్న అడవిలో 1:3 అన్నట్టుగా ఒక్కో ఆడ పులికి మూడు మగ పులుల కాంపిటీషన్ ఉంది. వాటి బలం ముందు ఇది పెద్దగా ఆనదు. దీంతో కాళ్లకు పని చెప్పింది. తాను ఇన్నాళ్లుగా ఉన్న మహారాష్ట్ర అడవిని దాటింది. ఎదురొచ్చిన వాగులను దాటింది. అడ్డంగా ఉన్న బొగ్గు గనులను దాటింది తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చింది.. ఆదిలాబాద్ జిల్లాలోని మహబూబ్ ఘాట్ నుంచి నిర్మల్ జిల్లా పరిధిలోని అడవుల్లోకి వెళ్ళింది. అక్కడ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో ఆ పులి కదలికలు కనిపించాయి. అయితే ఆ పులి పేరు జానీ అని..కొంత కాలంగా అది ఆడ తోడు కోసం తిరుగుతోందని అటవీ శాఖ అధికారుల పరిశీలనలో తేలింది. జానీ మాత్రమే కాకుండా ఎస్ 12 అనే పేరు గల పులి కూడా ఇలానే తిరుగుతోందని అటవీశాఖ అధికారులు వివరించారు. ముఖ్యంగా జానీ కొంతకాలంగా ఆదిలాబాద్ అడవుల్లోకి రావడం మహారాష్ట్ర వెళ్ళిపోవడం.. మళ్లీ అక్కడి నుంచి ఆదిలాబాద్ అడవుల్లోకి ఎంట్రీ ఇవ్వడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇలా ఏకంగా 500 కిలోమీటర్లు ఆ పులి నడిచింది.

    ఆడ తోడు దొరకకపోవడంతో..

    జానీకి ఆడ తోడు దొరకకపోవడంతో ఎట్టకేలకు అది మహారాష్ట్ర సరిహద్దుకు వంద మీటర్ల దూరంలో ఉన్న అప్పారావుపేట బీట్ పరిధిలోని కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం పరిధిలోకి వచ్చే పెంబి అడవుల్లోకి వెళ్లిపోయింది. స్థానికంగా ఉన్న రైతులు జానీ పాదముద్రలు చూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పెంబి తండ భీమన్న చెరువు ప్రాంతంలో పెద్దపులి పాదముద్రలు గుర్తించిన అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు.. జానీ పాదముద్రలు నిర్మల్ జిల్లా కుంటాల మండలం లోని అటవీ ప్రాంతంలో.. మహారాష్ట్రకు సరిహద్దున 100 మీటర్ల దూరంలో అప్పారావుపేట బీట్ పరిధిలో జానీ ఆనవాళ్లు కనిపించాయి. అయితే ఈ సమాచారాన్ని తెలంగాణ అటవీశాఖ అధికారులు మహారాష్ట్ర అటవీశాఖ అధికారులకు అందించారు.. అయితే సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్ వద్ద పెద్దపులి కనిపించింది.. అదే మార్గంలో కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలోకి వెళ్లిపోయిందని అధికారులు ప్రకటించారు. అయితే కవ్వాల్ ప్రాంతంలో ఆడపులులు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ ఉన్న మగ పులులు జానీకి అంత అవకాశం ఇస్తాయా? అనేది అనుమానమేనని అటవీశాఖ అధికారులు అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే జానీ మళ్లీ మహారాష్ట్ర అడవిలోకి వెళ్లక తప్పదని వారు వివరిస్తున్నారు