https://oktelugu.com/

Kim Jong Un: అమెరికా గుండెల్లో ‘అణు’ వణుకు.. విచ్చలవిడిగా కిమ్‌ ఆదేశాలు!

అగ్రరాజ్యం అమెరికా కాబోయే అద్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను ఢీకొట్టేందుకు తాను రెడీగా ఉన్నానని ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రకటించిన కొన్ని గంటలకే.. అమెరికా గుండెల్లో దడ పుట్టే వార్త బయటకు వచ్చింది.

Written By: Raj Shekar, Updated On : November 18, 2024 3:29 pm
Kim Jong Un

Kim Jong Un

Follow us on

Kim Jong Un: అమెరికా, ఉత్తర కొరియా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అధ్యక్షుడు ఎవరనే విషయంతో సంబంధం లేకుండా కిమ్‌.. ఆదేశాన్ని తన శత్రు దేశంగానే భావిస్తున్నారు. కిమ్‌ను దారిలోకి తెచ్చుకునేందుకు డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కానీ కుక్క తోక వంకర అన్నట్లుగా.. కిమ్‌ దారికి రాలేదు. తాజాగా ఎన్నికల్లో మరోసారి ట్రంప్‌ విజయం సాధించాడు. దీంతో కిమ్, ట్రంప్‌ మధ్య మళ్లీ చర్చలు జరుగుతాయని అంతా భావిస్తున్న సమయంలో కిమ్‌ బాంబు పేల్చాడు. అమెరికా కాబోయే అధ్యక్షుడితోనూ పోరాటానికి రెడీ అని కిమ్‌ ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే అమెరికాకు వణుకు పుట్టించే వార్త ఒకటి బయటకు వచ్చింది. అమెరికాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అపరిమితంగా అణ్వాయుధాలు తయారు చేయాలని కిమ్‌ దేశ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కిమ్‌ ఆదేశాలు అందడమే ఆలస్యం.. అధికారులు అణ్వాయుధాలపై ఫోకస్‌ పెట్టారు.

గత అనుభవాల దృష్ట్యానే..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ ఘన విజయం సాధించారు. దీంతో కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అప్రమత్తమయ్యారు. గతంలో ట్రంప్‌ పాలనలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పనెట్టుకుని అమెరికా వ్యూహాలను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అపరిమిత అణ్వాయుధాల తయారీకి కిమ్‌ మరోసారి తన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల తన అధికారులతో సమావేశం నిర్వహించిన కిమ్‌ దక్షిణ కొరియాతో కలిసి అమెరికా అణ్వస్త్ర వ్యూహాలకు పదును పెట్టడాన్ని ఖండించారు. జపాన్‌తో కలిసి ఆసియా నాటో ఏర్పాటు చేయాలన్న ఆలోచననూ తప్పు పట్టారు.

శక్తి పెంచుకుంటున్న కిమ్‌..
అమెరికా, దక్షిణ కొరియా కలిసి దాడి చేసినా ఎదుర్కొనేందుకు కిమ్‌ తన శక్తిని పెంచుకుంటున్నారు. ఈమేరకు కిమ్‌ సేనలు వేగంగా అణ్వాయుధాలు తయారు చేస్తున్నాయి. ఖండాంతర క్షిపిణులను వేగంగా తయారు చేస్తోంది. ఇక ఉత్తర కొరియా త్వరలోనే న్యూక్లియర్‌ బాంబు పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని దక్షిణ కొరియా ఇంటలిజెన్స్‌ సంస్థలు భావిస్తున్నాయి.