https://oktelugu.com/

Hyderabad Traffic : బతికుండగానే నరకం చూడాలంటే ఇప్పుడు హైదరాబాద్ లో తిరగండి

తాజాగా రాయదుర్గం- షేక్ పేట్ మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దాదాపు 2 కి.మీల మేర వాహనాలు నిలిచి వాహనదారులకు నరకం కనిపిస్తోంది. ఇవే కాదు.. ఉప్పల్-తార్నాక, సికింద్రాబాద్-బేగంపేట్, దిల్ సుఖ్ నగర్-మలక్ పేట్, చాదర్ ఘాట్- కూకట్ పల్లి , మియాపూర్, పటాన్ చెరు లలో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

Written By:
  • NARESH
  • , Updated On : July 25, 2023 / 03:20 PM IST
    Follow us on

    Hyderabad Traffic : నరకానికి వెళ్లాలనుకునే వారు ఈ మధ్య హైదరాబాద్ బస్సు టైర్ల కింద పడిపోతున్నారు. దానికంటే ఓ వాహనం వేసుకొని వర్షం వచ్చినప్పుడు రోడ్డు ఎక్కితే చాలు.. అయితే వానల్లో మునిగిపోవడమో లేదంటే.. ట్రాఫిక్ లో చిక్కి వేచివేచి శల్యమవడమో అవుతారు. ఎందుకంటే వానొస్తే చాలు హైదరాబాద్ లో ట్రాఫిక్ నరకానికి నకలు అవుతుంది. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోతాయి. గంటల తరబడి రోడ్లపైనే ఉండాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. తిండికి, నీళ్లకు చోటు ఉండదు. వరద వస్తే అంతే సంగతులు. ఇంటికి ఎప్పుడు చేరుతామో చెప్పలేం.. అలా ఉంటుంది పరిస్థితి.

    చిన్న వానలు పడితే చాలు హైదరాబాద్ రోడ్లపై నీరు నిలిచి భారీగా ట్రాఫిక్ స్తంభిస్తుంది. అయితే ఇప్పుడు అల్పపీడన ప్రభావంతో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే నాలుగైదు రోజులుగా దంచి కొట్టింది. మంగళవారం కూడా భారీ వర్షం పడుతోంది. దీంతో ఉదయమే ఆపీసు, స్కూళ్లకు వెళ్లే వాహనాలతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. 10 నిమిషాల ప్రయాణానికి కూడా వాహనదారులు గంటల తరబడి ఎదురుచూడాల్సిన కర్మ హైదరాబాద్ రోడ్లపై ఉంది.

    తాజాగా రాయదుర్గం- షేక్ పేట్ మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దాదాపు 2 కి.మీల మేర వాహనాలు నిలిచి వాహనదారులకు నరకం కనిపిస్తోంది. ఇవే కాదు.. ఉప్పల్-తార్నాక, సికింద్రాబాద్-బేగంపేట్, దిల్ సుఖ్ నగర్-మలక్ పేట్, చాదర్ ఘాట్- కూకట్ పల్లి , మియాపూర్, పటాన్ చెరు లలో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

    వర్షం, నీటితో నిండడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు నరకం చూపిస్తున్నారు. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు అని చెప్పడంతో ఇప్పటికే ప్రభుత్వం ప్రజలను రోడ్డు ఎక్కవద్దని.. అవసరమైతేనే రావాలని సూచించింది. రాష్ట్రానికి వర్షం రెడ్ అలెర్ట్ కూడా జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.