Mission Impossible 7 Collection: మిషన్ ఇంపాజిబుల్ 2 వారాల్లో 3000 కోట్లు.. వచ్చిన లాభాలతో ఎన్ని బాహుబలి లాంటి సినిమాలు తియ్యొచో!

ఇప్పటి వరకు ఈ చిత్రం విడుదలై రెండు వారాలు పూర్తి కాగా కేవలం ఇంగ్లీష్ వెర్షన్ కి 371 కోట్ల రూపాయిల వసూళ్లు వచ్చాయి. ఇండియన్ కరెన్సీ లెక్క ప్రకారం 3000 వేల కోట్ల రూపాయిల పైన అన్నమాట. అంటే పెట్టిన డబ్బులకు 600 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి అన్నమాట. ఇది సాధారణమైన విషయం కాదు. అవతార్ కి కూడా ఇంత ఫాస్ట్ గా కలెక్షన్స్ రాలేదు అని అంటున్నారు. మరి ఫుల్ రన్ లో ఈ చిత్రం అవతార్ కలెక్షన్స్ ని దాటుతుందా లేదా అనేది చూడాలి.

Written By: Vicky, Updated On : July 25, 2023 3:22 pm

Mission Impossible 7 Collection

Follow us on

Mission Impossible 7 Collection: హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ కి మన ఇండియా లో ఎలాంటి ఫ్యాన్స్ ఉంటారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు ఇక్కడ సిటీస్ లో మన స్టార్ హీరో రేంజ్ కలెక్షన్స్ వస్తుంటాయి. ఇక ఆయన నటించిన చిత్రాలలో మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఇప్పటికే ఈ సిరీస్ నుండి ఆరు సినిమాలు వచ్చాయి, ఇప్పుడు రీసెంట్ గా 7 వ సినిమా వచ్చింది.

ఈ చిత్రానికి కూడా మొదటి రోజు నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ రావడం తో కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా దంచి కొట్టేశాయి. ముఖ్యంగా మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాకి సుమారుగా ఇప్పటి వరకు 96 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఇది సాధారణమైన రికార్డు కాదు, హిందీ సినిమాలు కూడా ఈమధ్య ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టలేని పరిస్థితి ఏర్పడింది.

ఇది ఇలా ఉండగా ఈ చిత్రం హాలీవుడ్ లో కొత్త సినిమాలను కూడా ఎదురుకొని అద్భుతమైన వసూళ్లను సాధిస్తూ ముందుకు పోతుంది. ఈ సినిమాని నిర్మించడానికి దాదాపుగా 291 కోట్ల రూపాయిలు ఖర్చు అయ్యింది. అంటే ఇండియన్ కరెన్సీ లెక్క ప్రకారం 2400 కోట్ల రూపాయిలు అన్నమాట.