Telangana Rains: తెలంగాణకు వాతావరణ శాఖ మరోమారు వర్ష సూచన చేసింది. రాష్ట్రంలో రెండు రోజులు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరవం వద్ద నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ నుంచి 3.1 కిమీ మధ్య చక్రవాతపు ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అయితే తాజా వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. మరోవైపు సోయా కొనుగోళ్లు జరుగుతున్నాయి. పత్తి ఏరే పనులు కూడా రైతులు చేపడుతున్నారు. ఈతరుణంలో కురుస్తున్న వర్షాలతో పంటలకు నష్టమే తప్ప ప్రయోజనం లేదని రైలుతు పేర్కొంటున్నారు.
గురువారం నుంచే వానలు..
చక్రవతాత ఆవర్తనం ప్రభావంతో గురువారం(అక్టోబర్ 31న) రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజాబాబాద మెదక్, కరీంనగర్, హైదరాబాద్‌తోపాటు మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరువర్షాలు కురిశాయి. తాజాగా ఈ జిల్లాలకే వాతారవణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శుక్ర, శనివారాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
అప్రమత్తమైన రైతులు..
తెలంగాణలో ఆకాశం గురువారం నుంచే మేఘావృతమై ఉంటోంది. దీంతో రైతులు కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే మార్కెట్‌కు తెచ్చిన పత్తి, వరి, సోయా, మొక్కజొన్న పంటలు తడవకుండా కాపాడుకుంటున్నారు. టార్పాలిన్ కవర్లు కప్పి ఉంచారు. మరోవైపు వరి కోతలు నిలిపివేశారు. పత్తి ఏరే పనులు ఆగిపోయాయి. తాజా వర్షాలతో వరి పొలాలు నేల వాలుతాయని, గింజరు రాలతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక పత్తి రంగు మారుతుందని, నాణ్యత దెబ్బతింటుందని పేర్కొంటున్నారు. ఇప్పటికే దిగుబడి తగ్గిందని, ఈ తరుణంలో వర్షాలతో మరింత నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.