HomeతెలంగాణHyderabad Heavy Rains: హైదరాబాద్‌ అతలాకుతలం.. మళ్లీ మునిగింది!

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌ అతలాకుతలం.. మళ్లీ మునిగింది!

Hyderabad Heavy Rains: అకాల వర్షాలు ఒకవపై అన్నదాతను అతలాకుతలం చేస్తున్నాయి. వరి రైతులకు కన్నీరు మిగులుస్తున్నాయి. యాసంగి పంటలన్నీ తుడిచిపెట్టుకుపోతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఏ రైతును కదిలించినా కన్నీరే ఉబికి వస్తోంది. ఇదిలా ఉంటే.. విశ్వనగర్‌ హైదరాబాద్‌ కూడా అకలా వర్షాలకు చిగురిటాకులా వణుకుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేకుండా వర్షాలుకు లోతట్టు ప్రాంతాలు జలమయ్యామయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తుండటంతో.. ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. సోమవారం రాత్రి నుంచి హైదరాబాద్‌లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షం కరుస్తోంది.

నగరమంతా భారీ వర్షాలు..
నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, ముసాపేట్, జేఎన్‌టీయూ, నిజాంపేట్, జగద్గిరిగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌ పేట్, ఎస్‌ఆర్‌ నగర్‌తోపాటు నగరవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక కొండాపూర్, కొత్తగూడ, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, మలక్‌పేట, అల్వాల్‌ బొల్లారం, తిరుమలగిరి, హిమాయత్‌ నగర్, ముషీరాబాద్, ఆబిడ్స్‌ ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 6.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా.. షేక్‌పేట్‌లో 5.2 సెంటీమీటర్లు, జూబ్లీహిల్స్‌లో 4.6 సెంటీమీటర్లు, మాదాపూర్‌లో 4.5 సెంటీమీటర్లు, అమీర్‌పేట్‌లో 4 సెంటీమీటర్లు, మూసాపేట్‌లో 3.2 సెంటీమీటర్లు, రామంతపూర్‌లో 2.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణశాఖ స్పష్టం చేసింది.

మరో రెండు రోజులు వానలు..
ఇక అప్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటిచింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని సూచించింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

కొట్టుకుపోయిన రైతుల కష్టం
అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ధాన్యం తడిసి ముద్దవ్వడం, పొలాల్లోని పంటకు నష్టం జరగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మరోవైపు వ్యవసాయాధికారులు దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టం అంచనా వేస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular